ICC T20 Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ డిక్లేర్ చేసింది. తాజా ర్యాంకింగ్స్ లో భారత జట్టు టాప్ లోకి చేరింది. స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగిన టీ20 , వన్డే సీరీస్ (ICC T20 Rankings)లలో క్లీన్ స్వీప్ చేసింది.
ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ టాప్ లోకి వచ్చింది. ప్రస్తుతం రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. 2016 సంవత్సరంలో టీమిండియా టాప్ లో ఉండగా మళ్లీ 2022లో నెంబర్ వన్ కు చేరింది.
టీ20 ఫార్మాట్ లో ఇప్పుడే నెంబర్ వన్ కు రావడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే దుబాయి వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఘోరంగా ఓడి పోయింది దాయాది పాకిస్తాన్ చేతిలో.
విచిత్రం ఆ తర్వాత కీవీస్ తో గెలిచినా ఆ తర్వాత దక్షిణాఫ్రికా టూర్ లో దారుణంగా ఓటమి మూటగట్టుకుంది. అనంతరం రోహిత్ శర్మ ను బీసీసీఐ మూడు ఫార్మాట్ లకు స్కిప్పర్ గా నియమించింది బీసీసీఐ.
ప్రస్తుతం హెడ్ కోచ్ గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం భారత జట్టు 10484 రేటింగ్ పాయింట్లతో టాప్ లో నిలిచింది. ఫస్ట్ ర్యాంక్ అందుకుంది.
గతంలో టాప్ లో ఉన్న ఇంగ్లండ్ ను దాటేసి టీమిండియా ఫస్ట్ కు చేరింది. ఈనెల 24 నుంచి శ్రీలంకతో టీ20 సీరీస్ ఉంది. దీనిపై కూడా విజయం సాధించి మరోసారి తన ర్యాంకును పదిలం చేసుకుంటుంది మన జట్టు.
Also Read : అమిత్ చంద్ర షా సంచలన కామెంట్స్