ICC T20 World Cup USA : అమెరికాలో టి20 వరల్డ్ కప్
ఇప్పటికే ఖరారు చేసిన ఐసీసీ
ICC T20 World Cup USA : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు అత్యంత జనాదరణ లభిస్తోంది. వచ్చే ఏడాది 2024లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది 2023లో హైబ్రిడ్ పద్దతిలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. దీనిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్వహిస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసింది. ఇంటర్నేషనల్ సీజన్ కు సంబంధించి ఆయా భాగస్వామ్య దేశాల టూర్స్ ను ప్రకటించింది.
ICC T20 World Cup USA Viral
ఈ తరుణంలో ఈసారి టి20 వరల్డ్ కప్ ను ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఉత్కంఠకు తెర దించింది ఐసీసీ. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేసింది. టెన్నిస్, ఫుట్ బాల్, గోల్ఫ్ ను ఆదరించే అమెరికాలో తొలిసారిగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది సంచలన నిర్ణయం అని చెప్పక తప్పదు.
ఇప్పటికే పలు క్రికెట్ లీగ్ లు అమెరికాలో టోర్నీలు ప్రారంభించాయి. ఆయా గ్రౌండ్లను కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిలో పడ్డాయి. వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు అమెరికా సిద్దంగా ఉందని ప్రకటించింది. ఈసారి టి20 వరల్డ్ కప్ అమెరికాతో పాటు వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించనున్నాయని ఐసీసీ స్పష్టం చేసింది.
Also Read : BCCI SBI Life : బీసీసీఐతో ఎస్బీఐ లైఫ్ ఒప్పందం