ICC World Cup Team : ఐసీసీ వ‌ర‌ల్డ్ టీమ్ డిక్లేర్

ఆరుగురు భార‌త ఆట‌గాళ్ల‌కు చోటు

ICC World Cup Team : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ఇండియాలో ఘ‌ణంగా నిర్వ‌హించింది. ఆస్ట్రేలియా జ‌ట్టు విన్న‌ర్ గా నిలిచింది. మొత్తం టోర్నీలో 10 జ‌ట్లు పాల్గొన్నాయి. సెమీస్ కు నాలుగు జ‌ట్లు చేరాయి.

ICC World Cup Team Finalized

తొలి సెమీస్ లో భార‌త్ న్యూజిలాండ్ ను ఓడించింది. ఆసిస్ ద‌క్షిణాఫ్రికాను రెండో సెమీస్ లో ప‌రాజ‌యం పాలు చేసింది. టీమిండియా, ఆస్ట్రేలియా జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకున్నాయి. ఈ సంద‌ర్భంగా టోర్నీ ముగిసింది. జ‌గ‌జ్జేత‌గా నిలిచింది పాట్ క‌మిన్స్ సార‌థ్యంలోని ఆసిస్.

దీంతో టోర్నీలో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును ప్ర‌క‌టించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. తాజాగా ఐసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌క‌టించిన వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో భార‌త దేశానికి చెందిన ఆరుగురు కీల‌క ఆట‌గాళ్ల‌కు చోటు ద‌క్క‌డం విశేషం.

జ‌ట్టు ప‌రంగా చూస్తే రోహిత్ శ‌ర్మ‌, క్వింటాన్ డికాక్ , విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్ , కేఎల్ రాహుల్ , జ‌డేజా, గ్లెన్ మ్యాక్స్ వెల్ , ఆడ‌మ్ జంపా, జ‌స్ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మ‌ధుశంక‌, కోయెట్టీని ఎంపిక చేసింది.

Also Read : Rohit Sharma : రోహిత్ శ‌ర్మ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!