Kevin Pietersen : మోదీ ఐకానిక్..వరల్డ్ లీడర్ – పీటర్సన్
ప్రధానికి మాజీ క్రికెటర్ కితాబు
Kevin Pietersen : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఏకంగా నరేంద్ర మోదీని మోస్ట్ పవర్ ఫుల్ వరల్డ్ లీడర్ అంటూ పేర్కొన్నాడు. ట్విట్టర్ వేదికగా ఆయన సోమవారం స్పందించారు. ఇలాంటి వారే నాయకులుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. రోజు రోజుకు వయసు మీద పడుతున్నా ఎక్కడా వన్నె తగ్గడం లేదంటూ కితాబు ఇచ్చారు పీటర్సన్ .
తాజాగా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ ప్రాజెక్ట్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా నరేంద్ర మోదీ(PM Modi) సందర్శించారు. దాదాపు 20 కిలోమీటర్ల మేర జంగిల్ సఫారీ చేశారు. అనంతరం ఆస్కార్ అవార్డు దక్కించుకున్న భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ది ఎలిఫెంట్ విష్పరర్స్ లో నటించిన ఏనుగులతో పాటు సంరక్షకులు బొమ్మన్ , బెల్లీ, రఘులను పరామర్శించారు. ఏనుగులకు చెరుకులను కూడా తినిపించారు.
ఇదిలా ఉండగా హంటర్ దుస్తులు వేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఫోటోలు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయ్యాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోదీ హంటర్ ఫోటోను ప్రత్యేకంగా షేర్ చేశారు కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) . ప్రస్తుతం ప్రధానమంత్రి ప్రపంచంలోనే టాప్ ఎమర్జింగ్ లీడర్ గా ఉన్నారు.
Also Read : రింకూ నువ్వే నా హీరో