MP Sanjay Singh : బీజేపీలో చేరితే..చేర్పిస్తే రూ. 45 కోట్లు
ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు
MP Sanjay Singh : నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు ప్రయత్నిస్తోందంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఆప్ ను వదిలి భారతీయ జనతా పార్టీలో చేరితే రూ. 20 కోట్లు, ఇంకొందరిని చేర్పిస్తే రూ. 25 కోట్లు ఇస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చారంటూ ఆరోపించింది.
ఆప్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిపై తీవ్ర వత్తిళ్లు చేస్తున్నారంటూ మండిపడింది ఆప్. మేం ఇచ్చే బంపర్ ఆఫర్ రూ. 20 కోట్లు తీసుకోండి లేదంటే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వంటి సీబీఐ కేసులను ఎదుర్కోండి అంటూ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh).
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విచ్చలవిడిగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందంటూ మండిపడ్డారు. ప్రత్యేకించి ఆప్ ఎమ్మెల్యేలను నగదు, బెదిరింపులతో ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులను జరపడాన్ని తప్పు దోవ పట్టించేందుకే ఆప్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందంటూ బీజేపీ చేసిన ఆరోపణలను సంజయ్ సింగ్ తప్పు పట్టారు.
ఇదంతా అవాస్తవమని పేర్కొన్నారు. విచిత్రం ఏమిటంటే కాషాయ పార్టీ చేసిన ప్రయత్నాలేవీ సఫలీకృతం కాలేదన్నారు ఎంపీ సంజయ్ సింగ్.
ప్రధానంగా తమ పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ఇతర ఎమ్మెల్యేలను కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు.
అజయ్ దవ్, సంజీవ్ ఝా , సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్ బీజేపీతో స్నేహ పూర్వక సంబంధాలు కలిగి ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు సంజయ్ సింగ్.
Also Read : అశోక్ గెహ్లాట్ కు సోనియా గాంధీ ఆఫర్