Imran Khan Comment : ఇమ్రాన్ ఖాన్ లేచి ప‌డిన కెర‌టం

క్రికెట‌ర్ నుంచి పీఎం దాకా

Imran Khan Comment : పాకిస్తాన్ మాజీ ప్రధాని , మాజీ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. ఒక‌ప్పుడు ప్లే బాయ్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ ఉన్న‌ట్టుండి దేశానికి ప్ర‌ధాన‌మంత్రి అయ్యాడు. అనుకోకుండా అవిశ్వాస తీర్మానంతో ప‌ద‌వీచ్యుత‌డైన నాయ‌కుడిగా చ‌రిత్ర‌లో నిలిచి పోయాడు.

ఇప్ప‌టికీ అరెస్ట్ అయినా ఇమ్రాన్ ఖాన్ అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన నాయ‌కుడిగా ఉన్నాడు. ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఆయ‌న‌కు 70 ఏళ్లు. త‌న‌పై న‌మోదైన అనేక కేసుల్లో జ‌నాల‌ను హింస‌కు ప్రేరేపించార‌నే ఆరోప‌ణ‌ల‌తో స‌హా ఖాన్(Imran Khan Comment) అరెస్ట్ నుంచి త‌ప్పించుకున్నారు. గ‌తంలో ఆయ‌న‌ను అదుపులోకి తీసుకునేందుకు య‌త్నించ‌గా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు మిన్నంటాయి. గ‌త ఏడాది ఏప్రిల్ లో అధిక ద్రవ్యోల్బ‌ణం, పెరుగుతున్న ద్ర‌వ్య లోటు , స్థానికంగా అవినీతిని అదుపులో తీసుకు రాలేక పోవ‌డం త‌న ప‌ద‌విని పోగొట్టుకునేలా చేశాయి.

కానీ దానిని తాను ఒప్పుకోలేదు మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్. త‌న ప‌ద‌వి పోవ‌డం వెనుక అమెరికా కుట్ర దాగి ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆపై భార‌త విదేశాంగ విధానం గొప్ప‌గా ఉందంటూ కితాబు ఇచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ దిగి పోయిన నాటి నుంచి నేటి దాకా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరుతున్నారు.

ప్ర‌స్తుత స‌ర్కార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ ముందుకు సాగారు. 1947 స్వాతంత్రం వ‌చ్చిన నాటి నుంచి నేటి దాకా పాకిస్తాన్ చ‌రిత్ర‌లో ఎవ‌రూ అవిశ్వాస తీర్మానం ద్వారా ప‌ద‌విని కోల్పోయిన దాఖ‌లాలు లేవు. 2018 , 1992లో పాకిస్తాన్ ను ఏకైక ప్ర‌పంచ క‌ప్ అందించిన క్రికెట్ లెజెండ్ గా గుర్తింపు పొందాడు. పాకిస్తాన్ ఆర్మీ పై నిప్పులు చెరిగాడు. అప్ప‌టి ఆర్టీ చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జావేద్ బ‌జ్వా మ‌ధ్య సంబంధాలు లేక పోవ‌డం వ‌ల్లే ప‌ద‌విని కోల్పోయాడు.

1996లో అనూహ్యంగా పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) పేరుతో పార్టీని స్థాపించాడు. ఆ త‌ర్వాత 2018లో అధికారంలోకి వ‌చ్చారు. క్రికెట్ అంటే ఆ దేశంలో ఎన‌లేని పిచ్చి. అదే ఇమ్రాన్ ఖాన్ ను హీరో ను చేసింది. 2011లో యూత్ ను ఆక‌ర్షించాడు. 1952లో పుట్టాడు. ఆక్స్ ఫ‌ర్డ్ లో చ‌దివాడు.

1970 చివ‌రలో లండ‌న్ లో ప్లే బాయ్ ఖ్యాతిని పొందాడు. 1995లో వ్యాపార దిగ్గ‌జం గోల్డ్ స్మిత్ కూతురు ను పెళ్లి చేసుకున్నాడు. 2004లో విడాకులు తీసుకున్నాడు. టీవీ జ‌ర్న‌లిస్ట్ రెహ‌మ్ న‌య్య‌ర్ ను పెళ్లి చేసుకున్నాడు. అది కూడా విచ్ఛిన్న‌మైంది. ఆ త‌ర్వాత బుష్రా బీబీతో వివాహ‌మైంది. కానీ లెక్క‌లేనంతగా సంపాదించాడ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తంగా ఒక వెలుగు వెలిగిన ఇమ్రాన్ ఖాన్(Imran Khan Comment) ఇప్పుడు అరెస్ట్ కావ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!