Imran Khan : నిన్నటి దాకా ఆయన హీరో. ఎన్నో జట్లను మట్టి కరిపించిన వ్యక్తి. తన అద్భుతమైన బౌలింగ్ తో ..బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన క్రికెటర్.
అంతేనా పాకిస్తాన్ (Pakisthan) జట్టుకు నాయకుడిగా వరల్డ్ కప్ ను తీసుకు వచ్చిన ఘనత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ది.
పాకిస్తాన్ (Pakisthan) ప్రధాన మంత్రి (Prime minister) గా ఆయన ప్రతిపక్షాలను ఢీకొనలేక పోతున్నారు. తన వారితో పాటు విపక్షాలు యుద్దం ప్రకటించడంతో ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం ఆయన అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నారు. కౌంట్ డౌన్ మొదలైంది.
ఇదిలా ఉండగా చివరి బంతి వరకు తాను పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించాడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) .
కాగా మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కూతురు మరియం షరీఫ్ దమ్ముంటే పదవి కాపాడు కోవాలని సవాల్ విసిరారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ప్రతిపక్ష పీఎంఎల్ – ఎన్ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం ఈనెల 31న అసెంబ్లీలో ముందుకు రానుంది.
ఇక ఏప్రిల్ 3న ఓటింగ్ ఉంటుందని ఇప్పటికే హోం శాఖ మంత్రి రషీద్ ప్రకటించాడు.
దేశ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోబోతున్న మూడో పీఎం ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కావడం విశేషం.
ఆయన హయాంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆర్మీతో కూడా పొసగడం లేదు.
దీంతో విపక్షాలు ఇదే అదనుగా భావించి అవిశ్వాస తీర్మానం కోసం పట్టు పట్టాయి.
కాగా పాకిస్తాన్ (Pakisthan) జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 సభ్యులు ఉండగా ఇమ్రాన్ ఖాన్ సంకీర్ణ సర్కార్ నడిపిస్తున్నారు.
ఆయన పార్టీకి 155 మంది ఉండగా ఇతర ఆరు పార్టీల నుంచి 23 మందితో కలిపి అధికారంలో ఉన్నారు. కాగా అధికార పార్టీకి చెందిన 25 మంది మిత్రపక్షాలకు చెందిన మొత్తం గుడ్ బై చెప్పేశారు.
దీంతో ఇమ్రాన్ (Imran) ప్రభుత్వం మైనార్టీలో పడింది. అయితే బంతి ఇంకా తన కోర్టులో ఉందని తాను చివరి క్షణంలో అస్త్రాలను ప్రయోగిస్తానంటూ ప్రకటించాడు పీఎం.
అయితే ఓటింగ్ కు రావద్దంటూ ఇమ్రాన్ (Imran) లేఖ రాశాడు. అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) గట్టెక్కుతాడా లేక ఉన్న పళంగా ప్రభుత్వాన్నే రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళతాడా అన్నది వేచి చూడాలి.
Also Read : ఐపీఎల్ టైటిల్ గెలిస్తే రూ. 20 కోట్లు