Imran Khan : పాలకపక్షంపై ఇమ్రాన్ కన్నెర్ర
ఎన్నికల కోసం ఎప్పుడైనా సిద్దం
Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలక పక్షం ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతోందంటూ ధ్వజమెత్తారు. దీని వెనుక కథంతా నడిపిస్తున్నది మాజీ పీఎం , లండన్ లో తలదాచుకున్న నవాజ్ షరీఫ్ అంటూ ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని కానీ తన వెనుక ప్రజల బలం ఉందన్నారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలను నిష్పక్ష పాతంగా నిర్వహించేందుకు పాలక పాకిస్తాన్ డెమోక్రిటిక్ మూవ్ మెంట్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్ తనతో రోడ్ మ్యాప్ ను పంచుకుంటే అక్టోబర్ నెల దాకా వేచి ఉండేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు ఇమ్రాన్ ఖాన్.
పాకిస్తాన్ తెహ్రీక్ – ఇ – ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్ లో విశ్వాస ఓటింగ్ లో ఓడి పోయారు. గత ఏడాది ఏప్రిల్ లో పదవి నుంచి తప్పుకున్నారు. ఆనాటి నుంచి నేటి దాకా ముందస్తు జాతీయ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదంటూ ఆరోపించారు ఇమ్రాన్ ఖాన్(Imran Khan). ఎందుకంటే తాము ఓడి పోతామేమోనన్న భయం వారిలో ఉందంటూ ఎద్దేవా చేశారు.
Also Read : సమాజ్ వాదీ పార్టీ పట్ల జర భద్రం
