55 వేల మంది పోలీసుల‌కు రూ. 1243 కోట్లు జ‌మ‌

స‌లెండ‌ర్ లీవు బ‌కాయిలు విడుద‌ల

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ ను ప‌రిర‌క్షించేందుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్న పోలీసుల‌కు బాస‌ట‌గా నిలిచింది. ఈ మేర‌కు గ‌తంలో ప్ర‌క‌టించిన విధంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిల‌బెట్టుకున్నారు. కొత్త ఏడాదిలో వారికి కూడా న్యాయం చేస్తామ‌ని తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్రంలోని 55 వేల మంది పోలీసులకు కూడా చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పారు. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సరెండర్ లీవు బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే, నాబార్డు, విదేశీ నిధులతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం కూడా రూ.1,243 కోట్లు చెల్లించింది. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న పనులు తిరిగి ప్రారంభమై, రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఏర్పడింది.

ఇదిలా ఉండ‌గా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. పండగ నాటికే బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసి, పండగ వేళ వేల కోట్లు విడుదల చేయడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమంటున్నారు NGO సంఘాల నేతలు. గత ప్రభుత్వంలో జీతాలకే ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి, ఇప్పుడు పండగకు ముందే బకాయిలు పొందే స్థాయికి మారడంపై ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు రాష్ట్రంలో వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల ప‌రిధిలో ప‌ని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన ఉద్యోగుల‌కు కూడా రావాల్సిన క‌రవు భ‌త్యం (డీఏ)కు సంబంధించిన రూ. 1100 కోట్లకు పైగా ప్ర‌భుత్వం జ‌మ చేసింది. సీఎం ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!