TTD EO : జనవరి నెలలో శ్రీవారికి భారీ ఆదాయం
రూ. 123 కోట్లు వచ్చిందన్న ఈవో ధర్మారెడ్డి
TTD EO : తిరుమలకు భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని, గణనీయమైన ఆదాయం సమకూరుతోందని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి ధర్మారెడ్డి. శుక్రవారం డయల్ యువర్ కార్యక్రమాన్ని చేపట్టారు. భక్తులు అడిగిన ప్రశ్నలు, అనుమానాలు, సందేహాలను నివృత్తి చేశారు.
ఇందులో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు పుష్పాలు ధరించ కూడదన్నారు. అవి స్వామి వారికే చెందుతాయన్నారు. ఇక కొందరు భక్తులు తమ నుంచి డబ్బులు అడుగుతున్నారంటూ క్షురకులపై ఫిర్యాదు చేశారు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామని చెప్పారు ఈవో.
గత నెల జనవరి నెలలో భారీ ఎత్తున భక్తులు వచ్చారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించామని వెల్లడించారు. ఏకంగా తిరుమలకు భక్తుల కానుకుల ద్వారా హుండీ ఆదాయం రూ. 123 కోట్లు వచ్చిందని స్పష్టం చేశారు ధర్మారెడ్డి(TTD EO). గత ఒక్క నెలలోనే 20.78 లక్షల మంది స్వామి, అమ్మ వారిని దర్శించుకున్నారని ప్రకటించారు.
ఇక 7 లక్షల 51 వేల మంది తలనీలాలు సమర్పించు కున్నారని , 37.38 లక్షల మంది అన్నదానం స్వీకరించారని పేర్కొన్నారు. ఇక భక్తుల ఆకలిని తీర్చేందుకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం, టీ, కాఫీ, పాలు , అల్పహారాలు అందజేసినట్లు చెప్పారు ధర్మా రెడ్డి. లడ్డూల తయారీ కోసం కొత్తగా రూ. 50 కోట్లతో యంత్రాల వ్యవస్థ త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు ఈవో.
బెంగళూరుకు చెందిన దాత మురళీకృష్ణ అందించిన రూ. 23 కోట్ల విరాళంతో అధునాతన భవనం కట్టించామని, అందులో ఫిబ్రవరి 5 నుంచి కానుకల లెక్కింపు ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు ఈవో(TTD EO).
Also Read : తిరుమలలో శ్రీ విష్ణు పారాయణం