IND U19 Vs ENG U19 : బౌల‌ర్లు భ‌ళా ఇంగ్లండ్ విల‌విల‌

యువ భార‌త్ టార్గెట్ 190 ప‌రుగులు

IND U19 Vs ENG U19  : వెస్టిండీస్ వేదిక‌గా వివియ‌న్ రిచ‌ర్డ్స్ స్టేడియంలో జ‌రుగుతున్న అండ‌ర్ -19 ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్ లో యువ భార‌త ఆట‌గాళ్లు దుమ్ము రేపారు. అండ‌ర్ -19 ఇండియా బౌల‌ర్ల దెబ్బ‌కు 189 ప‌రుగుల‌కే ఆలౌటైంది.

భార‌త జ‌ట్టుకు చెందిన బౌల‌ర్లు రాజ్ బావా, ర‌వి కుమార్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ర‌వి కుమార్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు కెప్టెన్ టాప్ ప్రెస్ట్ తో స‌హా రెండు వికెట్ల‌ను కూల్చ‌డంతో ప‌రుగులు చేయ‌డం క‌ష్టంగా మారింది ఇంగ్లండ్(IND U19 Vs ENG U19 )కు.

ర‌వి ఫ‌స్ట్ ఓపెన‌ర్ జాక‌బ్ బెథెల్ ను 2 ప‌రుగులకే ప‌డ‌గొట్టాడు. ఆపై ప్రెస్టెస్ ను డ‌కౌట్ చేశాడు. ఇక సెట్ అవుతాడ‌ని అనుకుంటున్న త‌రుణంలో 27 ప‌రుగుల వ‌ద్ద జార్జ్ థామ‌స్ ను పెవిలియ‌న్ కు పంపించాడు.

రాజ్ వాబా వ‌రుస బ‌తుల్లో ల‌క్స‌ట‌న్ , బెల్ ల వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ తీవ్ర ఇబ్బందుల్లో ప‌డింది. జేమ్స్ సేల్స్ , జేమ్స్ రెవ్ ఇద్ద‌రూ జ‌ట్టును కుదట ప‌రిచేలా చేశారు.

ఇద్ద‌రూ స్కోరును నెమ్మ‌దిగా పెంచేందుకు య‌త్నించారు. 50 ప‌రుగుల స్టాండ్ తో అనిశ్చిత ప‌రిస్థితి నుంచి త‌మ జ‌ట్టును గ‌ట్టెక్కించారు. లేక పోయి ఉండి ఉంటే ఇంగ్లండ్ 100 లోపే చాప చుట్టేసి ఉండేది.

రెవ్ ను 95 ప‌రుగుల వ‌ద్ద అవుట్ చేశాడు రాజ్ బావా. ఈ కీల‌క ఇన్నింగ్స్ లో రాజ్ బావా ఐదు వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు నిర్ణీత 44.5 ఓవ‌ర్ల‌లో 189 ప‌రుగులే చేసింది.

ర‌వి కుమార్ 4 వికెట్లు కూల్చాడు. రెండో డౌన్ లో వ‌చ్చిన బ్యాట‌ర్ జేమ్స్ రూ 116 బంతులు ఆడి 12 ఫోర్ల‌తో 95 ప‌రుగులు చేశాడు.

Also Read : వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం యువ భార‌త్ సిద్దం

Leave A Reply

Your Email Id will not be published!