IND vs AUS 1st ODI : రాణించిన రాహుల్ గెలిచిన భారత్
5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
IND vs AUS KL Rahul : ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా సారథ్యం వహించాడు హార్దిక్ పాండ్యా. గత కొంత కాలంగా తీవ్ర ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ బ్యాట్ తో సమాధానం చెప్పాడు. టెస్టుల్లో స్థానం కోల్పోయిన రాహుల్ 75 రన్స్ తో సత్తా చాటాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఆస్ట్రేలియా 188 పరుగులకే చాప చుట్టేసింది. హైదరాబాద్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేయడం, ఇతర బౌలర్లు పరుగులు ఇవ్వక పోవడంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది. రవీంద్ర జడేజా కూడా రాణించాడు. 45 పరుగులతో కీలక పాత్ర పోషించాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. కాగా ఆసిస్ జట్టు మొదట్లోనే వికెట్లు కోల్పోయినా మిచెల్ మార్ష్ , స్కిప్పర్ స్టీవ్ స్మిత్ పరిస్థితిని చక్కదిద్దారు. మార్ష్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 65 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 రన్స్ చేశాడు.
ఇక స్టీవ్ 30 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లతో 22 రన్స్ చేశాడు. దీంతో ఆసిస్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది. ఆఖరులో వచ్చిన జోష్ 26 రన్స్ చేశాడు. షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీస్తే జడేజా 2, యాదవ్ , పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం 189 రన్స్ తో బరిలోకి దిగిన కిషన్ 3, కోహ్లీ 4 పరుగులకే వెనుదిరిగారు. సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశ పరిచాడు. గిల్ 20 రన్స్ కే పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బరిలోకి దిగిన రాహుల్(IND vs AUS KL Rahul) , పాండ్యా చక్కదిద్దారు.
హార్దిక్ 25 రన్స్ చేశాడు. ఇక రాహుల్,జడేజా కలిసి మరో వికెట్ కోల్పోకుండా జట్టు ను విజయ తీరాలకు చేర్చారు.
Also Read : 188 రన్స్ కే ఆసిస్ ఆలౌట్