IND vs AUS 1st ODI : 188 ర‌న్స్ కే ఆసిస్ ఆలౌట్

భార‌త బౌల‌ర్ల ప్ర‌తాపం

1st ODI INDvsAUS : ముంబై వేదిక‌గా జరుగుతున్న భార‌త్ , ఆస్ట్రేలియా తొలి వ‌న్డేలో ఆసిస్ 188 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు ప‌రుగులు చేయ‌లేక చ‌తికిల ప‌డ్డారు. 50 ఓవ‌ర్లు ఆడాల్సిన ఆసిస్ క‌కేవ‌లం 35.4 ఓవ‌ర్ల‌లోనే ఆలౌటైంది. హైద‌రాబాద్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కీల‌క పాత్ర పోషించాడు. రెండో ఓవ‌ర్ లోనే బోణీ కొట్టాడు. ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ ను ఔట్ చేశాడు. మైదానంలోకి వ‌చ్చిన స్టీవ్ స్మిత్ , ఓపెన‌ర్ మార్ష్ ప‌రుగులు చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

ఈ ఇన్నింగ్స్ లో మార్ష్ అద్భుతంగా ఆడాడు. 81 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. ఇక కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 ర‌న్స్ చేసి మ‌రో వికెట్ పోకుండా మార్ష్ తో క‌లిసి చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. కానీ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ అన‌వ‌స‌ర షాట్ కోసం ప్ర‌య‌త్నం చేసి కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో మార్ష్ తో ఉన్న భాగ‌స్వామ్యం దెబ్బతింది. 77 వ‌ద్ద రెండో వికెట్ ను కోల్పోయింది ఆసిస్.

ఫుల్ ఫామ్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న స‌మ‌యంలో మార్ష్ ను 19.4 ఓవ‌ర్ లో ర‌వీంద్ర జ‌డేజా అద్భుత‌మైన బంతితో బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నం చేశాడు మార్ష్ . థ‌ర్డ్ మ్యాన్ లో ఫీల్డింగ్ చేస్తున్న మ‌హ్మ‌ద్ సిరాజ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ త‌ర్వాత మైదానంలోకి వ‌చ్చిన ఆస్ట్రేలియాకు చెందిన ఏ బ్యాట‌ర్ కూడా ప‌రుగులు చేయ‌లేక పోయారు. దీంతో భార‌త జ‌ట్టు ముందు (1st ODI INDvsAUS Match) 189 ర‌న్స్ టార్గెట్ ఉంది. ఇదిలా ఉండ‌గా సంజూ శాంస‌న్ ను బీసీసీఐ తీసుకోలేదు.

Also Read : హ‌మ్మ‌య్య బోణీ కొట్టిన ఆర్సీబీ

Leave A Reply

Your Email Id will not be published!