IND vs AUS 1st T20 : భారత్ ఆసిస్ మధ్య నువ్వా నేనా
జట్టులో ఉండేది ఎవరు ఊడేది ఎవరు
IND vs AUS 1st T20 : యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022లో చేతులెత్తేసి ఇంటి బాట పట్టిన భారత జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. అటు పాకిస్తాన్ ఇటు శ్రీలంకతో ఓటమి పాలైంది.
ఈ తరుణంలో దూకుడు మీదున్న ఆస్ట్రేలియా జట్టుతో పోటీ పడనుంది టీమిండియా(IND vs AUS 1st T20). తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్ కు ప్రయారిటీ ఇస్తారా అనేది చూడాలి. మూడు మ్యాచ్ ల టి20 సీరీస్ ఆడనుంది భారత్ . మొదటి మ్యాచ్ మొహాలీలో
జరగనుంది.
మిగిలిన రెండు మ్యాచ్ లు నాగ్ పూర్ లో ఈనెల 23న, హైదరాబాద్ లో 25న జరుగుతాయి. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రారంభమయ్యే టి20 వరల్డ్ కప్ లో
టీమ్ మేనేజ్ మెంట్ దినేష్ కార్తీక్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. పంత్ కు దినేష్ పోటీదారుడుగా ఉన్నాడు. ఇద్దరిలో ఎవరు విఫలమైతే మరొకరికి ఛాన్స్ దక్కక పోవచ్చు.
ఆటగాళ్ల పరంగా చూస్తే కేఎల్ రాహుల్ గాయం నుంచి వచ్చి కోలుకున్నాక ఆశించిన మేర రాణించ లేదు. ఇక రోహిత్ శర్మ అడపా దడపా
తప్పితే ఆకట్టుకున్నది లేదు.
ఇక విరాట్ కోహ్లీ ఊహించని రీతిలో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఇదొక్కడే చెప్పు కోవాల్సింది భారత జట్టుకు. సూర్య కుమార్ యాదవ్ పై
అందరి దృష్టి నెలకొంది.
నిలకడగా రాణిస్తే బెటర్. దినేష్ కార్తీక్ కీపర్ గా రాణించినా చివరలో ఆడేందుకు అవకాశం రాక పోవడం ఇబ్బందిగా మారింది. హార్దిక్ పాండ్యా కు
ఢోకా లేదు.
అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ పరంగా అశ్విన్ , భువనేశ్వర్ కుమార్ , హర్షల్ పటేల్,
యుజ్వేంద్ర చాహల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read : భారత క్రికెట్ జట్టు న్యూ జెర్సీ ఆవిష్కరణ