IND vs AUS 3rd Test : భారత్ పరాజయం ఆసిస్ విజయం
చేతులెత్తేసిన భారత జట్టు
3rd Test INDvsAUS : నాలుగు టెస్టుల సీరీస్ లో మొదటి విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా. ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే భారత జట్టు నాగ్ పూర్ , ఢిల్లీ టెస్టులలో గ్రాండ్ విక్టరీ సాధించింది.
కేవలం 76 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసిస్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ టాప్ ఆర్డర్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లయాన్ హీరోగా మారాడు ఆ జట్టులో. ఏకంగా రెండో ఇన్నింగ్స్ లో ఒక్కడే శాసించాడు.
ఏకంగా 8 వికెట్లు తీశాడు. తనలో సత్తా తగ్గలేదని చాటాడు. భారత్ పై ఘన విజయంతో ఆస్ట్రేలియా(3rd Test INDvsAUS) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంది. ఇక టీమిండియా ప్లేస్ ప్రశ్నార్థకంగా మారింది. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ మూడు రోజులలోనే పూర్తయింది. వికెట్ కోల్పోయినా మరో వికెట్ పోకుండా సంయమనంతో ఆడారు ఆసిస్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్ , మార్నస్ లాబూస్ చాగ్నే . ఈ విజయంతో భారత్ 2 గెలిస్తే ఆసిస్ ఒకటి గెలిచింది.
ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగే నాలుగో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. ఈ మ్యాచ్ మార్చి 9 నుంచి 13 వరకు జరగనుంది. ఈ మ్యాచ్ ను స్వయంగా ఆస్ట్రేలియా , భారత దేశ ప్రధానమంత్రులు వీక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది కూడా. దీంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
Also Read : మిథాలీ రాజ్ డ్యాన్స్ అదుర్స్