IND vs AUS 3rd Test : 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
ఇండోర్ లో మూడో టెస్టు ప్రారంభం
IND vs AUS 3rd Test : కేఎల్ రాహుల్ కు ఊహించని షాక్ ఇచ్చింది బీసీసీఐ. తను ఇటీవల ఆడిన 10 ఇన్నింగ్స్ లలో 30 పరుగులు కూడా దాటలేదు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ను పక్కన పెట్టింది.
అతడి స్థానంలో ఇండోర్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో(IND vs AUS 3rd Test) కీలక మార్పు చేసింది. ఈ మేరకు కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టింది. అతడి స్థానంలో శుభ్ మన్ గిల్ ను తీసుకుంది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది భారత్. కడపటి వార్తలు అందేసరికి భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి45 రన్స్ చేసింది.
ఇప్పటి వరకు నాగ్ పూర్ , ఢిల్లీలలో జరిగిన తొలి, రెండో టెస్టులలో భారత జట్టు ఘన విజయాన్ని సాధించింది. 2-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో గెలవడం భారత్ కు ముఖ్యం.
ఎందుకంటే టెస్ట్ ఛాంపియన్ షిప్ లో కి చేరాలంటే గెలుపు సాధించాలి. ఇక కేఎల్ రాహుల్ విషయానికి వస్తే తన చివరి ఏడు ఇన్నింగ్స్ లలో 22, 23, 10, 2, 20, 17, 1 పరుగు చేశాడు. మరో వైపు శుభ్ మన్ గిల్ 13 ఇన్నింగ్స్ లలో 736 రన్స్ చేశాడు. వన్డేలలో కూడా అద్భుతంగా రాణించాడు.
జట్టు పరంగా చూస్తే రోహిత్ ,శుభ్ మన్ గిల్ , పుజారా, కోహ్లీ, అయ్యర్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్ , అక్సర్ పటేల్ , ఆర్. అశ్విన్ , ఉమేష్ యాదవ్ , సిరాజ్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
Also Read : బిల్ గేట్స్ తో టెండూల్కర్ భేటీ