IND vs AUS 4th Test : నాలుగో టెస్టుకు భారత్ ఆసిస్ సై
ఆసిస్ పరువు దక్కేనా ఇండియా గెలిచేనా
IND vs AUS 4th Test : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం నుంచి భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు(IND vs AUS 4th Test) ప్రారంభం కానుంది. నాలుగు టెస్టుల సీరీస్ లో భాగంగా ఇది చివరిది. ఇప్పటి వరకు జరిగిన నాగ్ పూర్ , ఢిల్లీ టెస్టులలో టీమిండియా విజయం సాధిస్తే ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది.
ఈ తరుణంలో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు ఎలాగైనా విజయం సాధించి సత్తా చాటాలని రెడీ అవుతోంది. వ్యూహాలు పన్నుతోంది. ఇక మూడో టెస్టులో అద్భుతంగా ఆడిన ఆసిస్ చివరి టెస్టులో గెలిచి సీరీస్ సమం చేయాలని, పరువు పోకుండా కాపాడు కోవాలని యోచిస్తోంది.
తన తల్లి అనారోగ్యం కారణంగా పాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇదే విషయాన్ని ఆసిస్ క్రికెట్ బోర్డు కూడా ప్రకటించింది. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది.
ఇక ఢిల్లీ టెస్టులో మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో తీవ్రంగా గాయపడిన ఆసిస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఈ టెస్టుకైనా అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానమే. ఇక ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయాన్ దెబ్బకు భారత టాప్ ఆర్డర్ విల విల లాడుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
భారత్ జట్టులో రోహిత్ కెప్టెన్ కాగా గిల్ , పుజారా, కోహ్లీ, అయ్యర్ , సూర్య , జడేజా, భరత్ , కిషన్ , అశ్విన్ , పటేల్ , యాదవ్ , షమీ , సిరాజ్ ఆడనున్నారు. ఇక ఆసిస్ జట్టులో ట్రావిస్ , ఖవాజా, లాబుషేన్ , స్మిత్ కెప్టెన్ కాగా , కాంబ్ , కారీ , స్టార్క్ , లియాన్ , మర్పీ , కుహ్నెమాన్ , కామెరాన్ గ్రీన్ ఆడతారు.
Also Read : టి20ల్లో రషీద్ ఖాన్ టార్చ్ బేరర్