IND vs AUS 4th Test : స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ

ఆసిస్ కు ధీటుగా భార‌త్ స్కోర్

IND vs AUS Day 4 4th Test : నిన్న‌టి దాకా ఫామ్ లేమితో ఇబ్బంది ప‌డుతున్న భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ స‌త్తా చాటాడు. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ ధీటుగా(IND vs AUS Day 4 4th Test) జ‌వాబు ఇచ్చింది.

క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి విరాట్ కోహ్లీ 110 ప‌రుగుల‌తో ఆడుతున్నాడు. ఆయ‌న‌కు తోడుగా అక్ష‌ర్ ప‌టేల్ క్రీజులో ఉన్నాడు. అంత‌కు ముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 480 ర‌న్స్ చేసింది. ఆ టీమ్ ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా 180 ర‌న్స్ తో దుమ్ము రేపితే కామెరాన్ 113 ర‌న్స్ చేశాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన టీమిండియా శుభ్ మ‌న్ గిల్ సెంచ‌రీతో స‌త్తా చాటాడు. ఆదివారం త‌న ప‌రుగుల దాహం తీర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. నాలుగో టెస్టు 4వ రోజున కీల‌క ప‌రుగులు చేయ‌డం విశేషం. త‌న టెస్టు కెరీర్ లో ర‌న్ మెషీన్ 28వ శ‌తకం చేశాడు. కోల్ క‌తా లోని ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జ‌రిగిన డే నైట్ టెస్టు మ్యాచ్ లో 2019 న‌వంబ‌ర్ 22న చివ‌రి సారిగా టెస్టు సెంచ‌రీ చేశాడు విరాట్ కోహ్లీ(Virat Kohli).

ట్రిపుల్ ఫిగ‌ర్ ల‌ను చేరుకున్నేందుకు 241 బంతులు ఎదుర్కొన్నాడు. అంత‌ర్జాతీయ టోర్నీలో కోహ్లీకి ఇది 75వ సెంచ‌రీ కాగా ఈ మ్యాచ్ లో భార‌త్ ను ప‌టిష్ట స్థితిలో నిలిపింది. ఓవ‌ర్ నైట్ బ్యాట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా 28 ర‌న్స్ వ‌ద్ద వికెట్ కోల్పోయింది. ఉద‌యం సెష‌న్ లో 32 ఓవ‌ర్ల‌లో 73 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

Also Read : ఆర్సీబీ ప‌రాజ‌యాల ప‌రంప‌ర

Leave A Reply

Your Email Id will not be published!