IND vs AUS WTC Final : ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఆసిస్
భారత్ ఘోర పరాజయం
IND vs AUS WTC Final : సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. భారత జట్టు చాప చుట్టేసింది. ఇంగ్లండ్ లోని ఓవెల్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు క్రికెట్ ఛాంపియన్ షిప్(IND vs AUS WTC Final) ను ఆస్ట్రేలియా ఎగరేసుకు పోయింది. భారత్ కు షాక్ ఇచ్చి విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో తనకు తిరుగే లేదని చాటింది ప్రత్యర్థి జట్టు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది ఆసిస్. మొదటిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్ లోకి ప్రవేశించిన ఆ జట్టు కోలుకోలేని రీతి లో దెబ్బ కొట్టింది. రోహిత్ సేన పరాజయం పాలై ఇంటి బాట పట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 209 రన్స్ తేడాతో ఓడించింది.
ఆసిస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఓవర్ లో మహ్మద్ సిరాజ్ ను ఔట్ చేయడంతో కథ ముగిసింది. ఆసిస్(Australia) ప్లేయర్లు సంబురాల్లో మునిగి పోయారు. మొదటి ఇన్నింగ్స్ లో రాణించిన అజింక్యా రహానే రెండో ఇన్నింగ్స్ లోనూ రాణించాడు. 46 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి ప్రతిఘటించే ప్రయత్నం చేసినా జట్టును ఓటమి నుంచి కాపాడలేక పోయారు. ఏక కాలంలో వెంట వెంటనే భారత జట్టు నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా మరో ఘనతను సాధించింది. ఐసీసీ టోర్నీలను ఏక కాలంలో అన్ని ఫార్మాట్ లలో విజేతగా నిలిచి అరుదైన ఘనతను స్వంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఆసిస్ భారీ స్కోర్ సాధించింది. హెడ్ 163 రన్స్ చేస్తే స్టీవ్ స్మిత్ 121 రన్స్ తో రెచ్చి పోయారు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో రహానే 89, జడేజా 48, ఠాకూర్ 51 రన్స్ చేసి ఆదుకున్నారు. 269 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఇక ఆసిస్ రెండో ఇన్నింగ్స్ లో 270 వద్ద డిక్లేర్ చేసింది. తొలి, రెండో ఇన్నింగ్స్ లు కలుపుకుని ఆసిస్ భారత్ ముందు 444 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్ లో నిరాశ పరిచిన రోహిత్ శర్మ 43, పుజారా 27 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టగా రహానే, కోహ్లీ ఆదుకునే ప్రయత్నం చేశారు.
Also Read : Supriya Sule : పార్లమెంట్ ను పవార్ నడపడం లేదు