IND vs AUS WTC Final : ప‌రుగుల వేట‌లో ఆసిస్

క‌ట్ట‌డి చేసిన ష‌మీ, శార్దూల్

IND vs AUS WTC Final : ఎట్ట‌కేల‌కు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్(IND vs AUS WTC Final) మ్యాచ్ లండ‌న్ లోని ఓవెల్ మైదానంలో ప్రారంభ‌మైంది. ముందుగా భార‌త క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచాడు. ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు ఆస్ట్రేలియా బ‌రిలోకి దిగింది. ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజా వెంట‌నే వెనుదిరిగాడు. శార్దూల్ ఠాకూర్, మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 112 ర‌న్స్ చేసింది.

స్టార్ ఓపెన‌ర్ , బ్యాట‌ర్ గా పేరు పొందిన ఆసిస్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ కీల‌క‌మైన ప‌రుగులు చేశాడు. 43 ప‌రుగులు చేసి స్కోర్ ను పెంచే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అన‌వ‌స‌రం బంతిని ఆడ బోయి శార్దూల్ ఠాకూర్ చేతికి చిక్కాడు. ప్ర‌స్తుతం స్టీవ్ స్మిత్ క్రీజులో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ మ‌రో వైపు జ‌ట్టును ఆదుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈసారి ఎలాగైనా స‌రే టెస్టు ఛాంపియ‌న్ షిప్ గెలుచు కోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది భార‌త జ‌ట్టు.

అంత‌కు ముందు మార్క‌ల్ లాబూషేన్ ను మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ 26 ప‌రుగుల వ‌ద్ద ఔట్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త జ‌ట్టు వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ గెల‌వ‌లేదు. దీంతో ఈసారైనా గెల‌వాల‌ని, ఛాంపియ‌న్ గా నిల‌వాల‌ని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మొత్తంగా మొద‌టి రోజు ప‌ట్టు సాధించింది టీమిండియా.

Also Read : Rakesh Tikait : రైతుల జోలికి వ‌స్తే ఖ‌బ‌డ్దార్ – టికాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!