IND vs BAN 1st Test 2022 : కుల్దీప్ కమాల్ బంగ్లా ఢమాల్
150 పరుగులకే ఆలౌట్
IND vs BAN 1st Test 2022 : బంగ్లాదేశ్ టూర్ లో భాగంగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు(IND vs BAN 1st Test 2022) పట్టు బిగించింది. ప్రధానంగా భారత బౌలర్లు అద్భుత ప్రతిభను కనబర్చారు. ప్రధానంగా ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ దెబ్బ కొడితే ఆ తర్వాత వచ్చిన కుల్దీప్ యాదవ్ సూపర్ స్పెల్ తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 5 వికెట్లు తీశాడు.
మూడో రోజు ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్లు కోల్పోయి 133 రన్స్ తో ప్రారంభించింది ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్. కానీ రెండో రోజు 33 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) మూడో రోజు కూడా సత్తా చాటాడు. 17 పరుగులతో క్రీజులో ఉన్న ఎబాదత్ హుస్సేన్ ను దెబ్బ కొట్టాడు.
దీంతో 144 పరుగులకే 9వ వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. అనంతరం ఖలీద్ అహ్మద్ డకౌట్ గా వెనుదిరగడంతో ప్రత్యర్థి జట్టు 150 పరుగులకే చాప చుట్టేసింది. ఆఖరి వికెట్ ను అక్షర్ పటేల్ తీశాడు. మొత్తంగా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీస్తే మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇక ఉమేష్ యాదవ్ , అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 133.5 ఓవర్లలో 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేఎల్ రాహుల్ , శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ ఆశించిన రీతిలో ఆడలేక పోయారు.
తీవ్ర నిరాశకు గురి చేశారు. ఈ తరుణంలో ఛతేశ్వర్ పుజారా, పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. 46 రన్స్ కు పంత్ వెనుదిరిగితే పుజారా సెంచరీ చేయకుండానే 90 రన్స్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు చేస్తే అశ్విన్ 58 , కుల్దీప్ యాదవ్ 40 రన్స్ తో ఆకట్టుకున్నారు.
Also Read : పంత్ ఫిట్ నెస్ సల్మాన్ భట్ కామెంట్స్