IND vs BAN 1st Test : విజ‌యానికి అడుగు దూరంలో భార‌త్

స‌త్తా చాటిన బౌల‌ర్లు..బంగ్లా ఎదురీత‌

IND vs BAN 1st Test : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొద‌టి టెస్టులో టీమిండియా విజ‌యం సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. గెల‌వాలంటే ఇంకా 4 వికెట్లు తీయాల్సి ఉంది. 513 ప‌రుగుల భారీ టార్గెట్ ముందుంచింది. ఆరంభంలో బంగ్లా ఇబ్బంది ప‌డ్డా జాకీర్ హ‌స‌న్ భార‌త బౌల‌ర్ల‌ను అడ్డుకుని ప‌రువు పోకుండా కాపాడాడు. ఆపై గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ సాధించేలా కీల‌క పాత్ర పోషించాడు.

హ‌స‌న్ వెనుదిరిగాక వెంట వెంట‌నే వికెట్లు ప‌డ్డాయి. నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆతిథ్య జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 272 ర‌న్స్ చేసింది.

భార‌త్ పై గెల‌వాలంటే చేతిలో నాలుగు వికెట్లు మాత్ర‌మే ఉన్నాయి. ఇంకా 241 ప‌రుగులు(IND vs BAN 1st Test) చేయాల్సి ఉంది. బౌల‌ర్లు స‌త్తా చాటితే విజ‌యం సాధించ‌డం ఖాయం. ఎలాగూ రోజంతా మ్యాచ్ ఉంది. డ్రా చేసుకునేందుకు వీలు లేదు. అయితే టార్గెట్ ఛేదించాలి లేదంటే ఓట‌మిని ఆహ్వానించాల్సిందే. ఇక మైదానంలో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబుల్ హ‌స‌న్ 40 ర‌న్స్ తో మెహ్ దీ హ‌స‌న్ 9 ప‌రుగుల‌తో ఉన్నారు.

అంత‌కు ముందు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ ఏ కోశాన ఛాన్స్ ఇవ్వ‌లేదు. మొద‌టి వికెట్ కు న‌జ్ముల్ షాంటో , జాకీర్ హ‌స‌న్ క‌లిసి తొలి వికెట్ కు 124 ర‌న్స్ చేశారు.

హ‌స‌న్ 224 బాల్స్ ఎదుర్కొని 13 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో శతకం పూర్తి చేశాడు. ఫ‌స్ట్ సెష‌న్ అంత‌గా ప్ర‌భావితం చేయ‌లేక పోయారు బౌల‌ర్లు. కానీ రెండో సెష‌న్ లో స‌త్తా చాటారు. మొత్తం 6 వికెట్లు కూల్చారు.

Also Read : భార‌త్ పై విజ‌యం ఆసిస్ సీరీస్ కైవ‌సం

Leave A Reply

Your Email Id will not be published!