IND vs BAN 1st Test : మొద‌టి టెస్టులో ప‌ట్టు బిగించిన భార‌త్

బంగ్లా 133 ప‌రుగుల‌కే ఎనిమిది వికెట్లు

IND vs BAN 1st Test : బంగ్లాదేశ్ తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో రెండ‌వ రోజు భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొద‌ట్లోనే భార‌త(IND vs BAN 1st Test)  బ్యాట‌ర్లు వెనుదిరిగినా ఆ త‌ర్వాత పుజారా, పంత్ , అయ్య‌ర్ ఇన్నింగ్స్ చ‌క్క‌దిద్దారు.

అనంతరం ర‌విచంద్ర‌న్ అశ్విన్ స‌త్తా చాటాడు. దీంతో త‌న మొద‌టి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆతిథ్య జ‌ట్టు ఆది లోనే వికెట్లు కోల్పోయింది. ఆట ముగిసే స‌మ‌యానికి ఆ జ‌ట్టు 8 వికెట్లు కోల్పోయి 133 ప‌రుగులు చేసింది.

భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక మ‌హ్మ‌ద్ సిరాజ్ ప్రారంభంలోనే వికెట్ ను కూల్చాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే బంగ్లాదేశ్ ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ కంటే ఇంకా 271 ప‌రుగుల వెనుకంజ‌లో ఉంది. తొలి టెస్టు ఛ‌టోగ్రామ్ స్టేడియంలో జ‌రుగుతోంది.

ఇక కుల్దీప్ యాద‌వ్ నాలుగు వికెట్ల‌తో రెచ్చి పోతే హైద‌రాబాదీ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కేవ‌లం 14 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి మూడు కీల‌క వికెట్లు తీశాడు. బంగ్లా టాప్ ఆర్డ‌ర్ ను కూల్చ‌డంలో సిరాజ్ , కుల్దీప్ యాద‌వ్ కీల‌క పాత్ర పోషించారు.

కుల్దీప్ యాద‌వ్ 33 ప‌రుగులు ఇచ్చి 4 ప‌డ‌గొడితే ఉమేష్ యాద‌వ్ 33 ర‌న్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంత‌కు ముందు అశ్విన్ 58 ర‌న్స్ చేస్తే కుల్దీప్ యాద‌వ్ 40 ర‌న్స్ చేశాడు.

Also Read : జ‌ర్న‌లిస్ట్ ఉద్విగ్నం మెస్సీ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!