IND vs NZ 1st T20 : టీ20 సీరీస్ కు టీమిండియా రెడీ
న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్
IND vs NZ 1st T20 : స్వదేశంలో వన్డే సీరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సీరీస్ పై కన్నేసింది. ఇవాల్టి నుంచి న్యూజిలాండ్ తో భారత్ పోటీ పడనుంది. భారత్ , న్యూజిలాండ్ మధ్య టీ20 సీరీస్ తొలి మ్యాచ్(IND vs NZ 1st T20) రాంచీ వేదికగా జరగనుంది. ఈ సీరీస్ లో పృథ్వీ షా కూడా స్క్వాడ్ లోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు రాంచీ చేరుకున్నాయి.
వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించాడు. ఇక టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. చాలా కాలం తర్వాత పృథ్వీ జట్టులోకి వచ్చాడు. దేశీవాళీ మ్యాచ్ ల్లో నిలకడగా రాణిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో ఈ టీ20 సీరీస్ నుంచి తప్పుకున్నాడు.
ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ తో పాటు శుభ్ మన్ గిల్ లకు భారత్ ఓపెనర్ అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన వన్డే సీరీస్ లో శుభ్ మన్ గిల్ దుమ్ము రేపాడు. దీంతో అతడికే ఓపనర్ పంపించనుంది మేనేజ్ మెంట్. ఇక రాహుల్ త్రిపాఠి మూడో స్థానంలో బరిలోకి దింపనుంది.
సూర్య కుమార్ యాదవ్ 4వ స్తానంలో జితేష్ శర్మ కు వికెట్ కీపింగ్ చాన్స్ దక్కనుంది. వన్డే సీరీస్ లో అంతగా ఆకట్టుకోలేదు సూర్య. కానీ టీ20 ఫార్మాట్ లో మాత్రం దుమ్ము రేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా నిలిచాడు.
ఇక జట్టు పరంగా చూస్తే హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాగా ఇషాన్ కిషన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్ ) , జతేశ్ శర్మ, దీపక్ హూడా, కుల్దీప్ యాదవ్ , శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు.
Also Read : ముగిసిన ప్రస్థానం సానియా భావోద్వేగం