IND vs NZ 2nd ODI : టీమిండియా సునాయ‌స విజ‌యం

2-0 తేడాతో వ‌న్డే సీరీస్ కైవ‌సం

IND vs NZ 2nd ODI : రాయ్ పూర్ వేదిక‌గా శ‌నివారం జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్ లో భార‌త జ‌ట్టు(IND vs NZ 2nd ODI)  సునాయసంగా విజ‌యం సాధించింది. భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచాడు. ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం , ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు న్యూజిలాండ్ ను 108 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేయ‌డంలో బౌల‌ర్లు స‌క్సెస్ అయ్యారు.

దీంతో త‌క్కువ టార్గెట్ ఛేదనలో బ‌రిలోకి దిగిన భార‌త్ స్కిప్ప‌ర్ రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. మ‌రోసారి నిరాశ ప‌రిచాడు విరాట్ కోహ్లీ. కేవ‌లం 11 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. మిగ‌తా ర‌న్స్ ను శుభ్ మ‌న్ గిల్ పూర్తి చేశాడు. దీంతో భార‌త జ‌ట్టు న్యూజిలాండ్ పై గెలుపొంది సీరీస్ కైవ‌సం చేసుకుంది.

ప్ర‌స్తుతం 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. మ‌రో వ‌న్డే మ్యాచ్ కీవీస్ తో ఆడాల్సి ఉంది. అంత‌కు ముందు భార‌త బౌల‌ర్లు రెచ్చి పోయారు. కీవీస్ బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. తొలి వ‌న్డేలో సిరాజ్ స‌త్తా చాటితే రెండో వ‌న్డేలో మ‌హ్మ‌ద్ ష‌మీ దుమ్ము రేపారు. మూడు వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్ట‌న్ సుంద‌ర్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇక మ‌హ్మ‌ద్ సిరాజ్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాద‌వ్ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ ను క‌ట్ట‌డి చేయ‌డంలో బౌల‌ర్లు కీల‌క పాత్ర పోషించారు. ఇక ఉప్ప‌ల్ లో జ‌రిగిన తొలి వ‌న్డేలో భారీ స్కోర్ ఛేద‌న‌లో చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు పోరాడిన న్యూజిలాండ్ క్రికెట‌ర్లు పూర్తిగా రెండో వ‌న్డేలో చ‌తికిల‌ప‌డ‌డం విస్తు పోయేలా చేసింది.

Also Read : చేత‌న్ శ‌ర్మ‌పై స‌న్నీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!