IND vs NZ 2nd T20 : న్యూజిలాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

65 ప‌రుగుల తేడాతో కీవీస్ ఓట‌మి

IND vs NZ 2nd T20 : న్యూజిలాండ్ టూర్ లో హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని యువ‌కుల జ‌ట్టు స‌త్తా చాటింది. మొద‌టి టి20 వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఆదివారం జ‌రిగిన రెండో టి20 మ్యాచ్ లో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది టీమిండియా. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భార‌త జ‌ట్టు భారీ స్కోర్ సాధించింది.

భార‌త స్టార్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ 49 బంతుల్లోనే ఫాస్టెస్ట్ సెంచ‌రీ సాధించాడు. 111 ప‌రుగులు చేసి భారీ స్కోర్ సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇషాన్ కిష‌న్ 36 ప‌రుగులు చేస్తే ఎప్ప‌టి లాగే రిష‌బ్ పంత్ 6 ప‌రుగులకే వెనుదిరిగాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ 13 ర‌న్స్ తో నిరాశ ప‌రిచాడు.

దీంతో 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి టీమిండియా(IND vs NZ 2nd T20) 191 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం 192 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ చేతులెత్తేసింది. భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. కీవీస్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు ప‌ట్టారు. భార‌త జ‌ట్టులో దీప‌క్ హూడా చుక్క‌లు చూపించాడు.

ఏకంగా నాలుగు కీల‌క‌మైన వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ జ‌ట్టు ప‌త‌నాన్ని శాసించాడు. ఇదే మ్యాచ్ లో మ‌రో రికార్డు చోటు చేసుకుంది. న్యూజిలాండ్ త‌రపున స్టార్ బౌల‌ర్ టిమ్ సౌథీ చివ‌రి ఓవ‌ర్ లో హ్యాట్రిక్ సాధించాడు. లాకీ ఫెర్గుస‌న్ రెండు వికెట్లు తీశాడు. దీంతో మూడు టి20 మ్యాచ్ ల సీరీస్ లో భార‌త జ‌ట్టు 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.

మ‌రో వైపు సంజూ శాంస‌న్ ను తీసుకోక పోవ‌డంపై నిర‌స‌న వ్య‌క్త‌మైంది.

Also Read : సూర్య’ భాయ్ ని త‌ట్టుకోవ‌డం కష్టం – కేన్

Leave A Reply

Your Email Id will not be published!