IND vs NZ 3rd ODI : మ్యాచ్ వర్షార్ఫణం సీరీస్ కీవీస్ కైవసం
వరుసగా రెండోసారి షాక్ ఇచ్చిన న్యూజిలాండ్
IND vs NZ 3rd ODI : అకాల వర్షం కొంప ముంచింది. శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు వన్డే సీరీస్ ను కోల్పోయింది. మూడు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
తాజాగా బుధవారం ఓవెల్ లో జరిగిన సీరీస్ ను నిర్దారించే మూడో మ్యాచ్(IND vs NZ 3rd ODI) లో సైతం వర్షం అడ్డంకిగా నిలిచింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లు ఆడకుండానే 47.3 ఓవర్లలో ఆలౌటైంది. మొత్తం 216 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 27 రన్స్ చేస్తే ఓపెనర్ శుభ్ మన్ గిల్ 13 రన్స్ చేశాడు.
ఆ తర్వాత మైదానంలోకి దిగిన వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి నిరాశ పరిచాడు. 16 బంతులు ఎదుర్కొని 10 పరుగులు చేశాడు. స్టార్ హిట్టర్ గా పేరొందిన సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశ పరిచాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 49 రన్స్ చేస్తే వాషింగ్టన్ సుందర్ 51 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది.
ఇక దీపక్ చాహర్, దీపక్ హూడా చెరో 12 రన్స్ చొప్పున చేశారు. ఇదిలా ఉండగా వరుసగా 11 ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్ ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్ ను మాత్రం పక్కన పెట్టడం చర్చకు దారి తీసింది.
సోషల్ మీడియాలో బీసీసీఐ పై, జట్టు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పై నిప్పులు చెరిగారు. ఇక మ్యాచ్ లో భాగంగా కీవీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 104 రన్స్ చేసింది. వర్షం రావడంతో మ్యాచ్ రద్దయింది. దీంతో 1-0 తేడాతో వన్డే సీరీస్ చేజిక్కించుకుంది కీవీస్.
Also Read : లక్ష్మణ్ నిర్వాకం అభిమానుల ఆగ్రహం