IND vs NZ ICC ODI World Cup : కీవీస్ ఇంటికి భార‌త్ ఫైన‌ల్ కు

టీమిండియా ఆల్ రౌండ్ షో

IND vs NZ ICC ODI World Cup : ముంబై – ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భార‌త్ జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. వ‌రుస‌గా ఇది రోహిత్ సేన‌కు తొమ్మిదో విజ‌యం. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన ప్ర‌తి మ్యాచ్ లోనూ గెలుపు సాధించింది. సెమీ ఫైన‌ల్ మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ‌ను రేపింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

IND vs NZ ICC ODI World Cup Updates

భార‌త బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. కీవీస్ బౌల‌ర్ల‌ను ఊచ కోత కోశారు. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ , శ్రేయ‌స్ అయ్య‌ర్ సెంచ‌రీల మోత మోగించారు. ఇక ఎప్ప‌టి లాగే శుభ్ మ‌న్ గిల్ షాన్ దార్ ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకుంటే హిట్ మ్యాన్ త‌న‌దైన శైలిలో రాణించాడు.

దీంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 397 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో భారీ టార్గెట్ ను ఛేదించే ప్ర‌య‌త్నంలో న్యూజిలాండ్ చివ‌రి దాకా పోరాడింది. డేర‌న్ మిచెల్ , కెప్టెన్ విలియ‌మ్స‌న్ అద్బుత‌మైన బ్యాటింగ్ తో ఆక‌ట్టుకున్నారు. ఏకంగా 70 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది భార‌త్.

వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ దుమ్ము రేపాడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో కీవీస్ కు చుక్క‌లు చూపించాడు. ఏకంగా 7 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే కోహ్లీ 113 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 117 ర‌న్స్ చేస్తే శ్రేయ‌స్ అయ్య‌ర్ 70 బంతుల్లో 4 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో 105 ప‌రుగులు చేశాడు.

మిచెల్ 134 ర‌న్స్ తో అద్వితీయ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టాడు. అయినా ఫ‌లితం లేక పోయింది.

Also Read : ICC ODI WORLD CUP COMMENT : క‌ప్ గెలిచేనా జెండా ఎగిరేనా

Leave A Reply

Your Email Id will not be published!