IND vs SA 4th T20 : సత్తా చాటిన భారత్ సీరీస్ సమం
82 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ
IND vs SA 4th T20 : ఎట్టకేలకు గాడిన పడింది భారత జట్టు. 5 మ్యాచ్ ల టి20 సీరీస్ లో భాగంగా మొదటి, రెండు వన్డేలు ఓడి పోయిన భారత్ తర్వాత పుంజుకుంది. నాల్గో గేమ్ లో సత్తా చాటింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో రాణించింది.
ఏకంగా పర్యాటక సౌతాఫ్రికా జట్టుపై 82 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. 170 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సఫారీ టీం 87 పరుగులకే
చాప చుట్టేసింది.
ఆ జట్టులో వారెన్ డస్సెన్ ఒక్కడే 20 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లు రెచ్చి పోయారు. ముఖ్యంగా ఆవేష్ ఖాన్ నాలుగు
వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు.
వైజాగ్ లో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో తన స్పిన్ మాయాజాలంతో మెస్మరైజ్ చేసిన యుజ్వేంద్ర చాహల్ మరోసారి బంతిని తిప్పేశాడు. రెండు
వికెట్లు తీశాడు.
ఇక హర్షల్ పటేల్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. విజయంలో కీలక భూమిక పోషించారు. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు(IND vs SA 4th T20) నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 169 రన్స్ చేసింది.
ఫినిషర్ దినేష్ కార్తీక్ దుమ్ము రేపాడు. 55 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సఫారీ జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. డెత్ బౌలర్ల భరతం పట్టాడు. ఇక హార్దిక్ పాండ్యా మరోసారి రాణించాడు.
కీలకమైన 46 పరుగులు చేశాడు. ఎప్పటి లాగే కెప్టెన్ రిషబ్ పంత్ విఫలమయ్యాడు. కేవలం 17 పరుగులు చేస్తే శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు చేసి నిరాశ పరిచారు.
ప్రోటీస్ బౌలర్లలో ఎంగిడి రెండు వికెట్లు తీస్తే జాన్సెన్ , కేశవ మహరాజ్ , ప్రిటోరియస్ , నోర్టే చెరో వికెట్ తీశారు.
Also Read : వన్డే చరిత్రలో ఇంగ్లాండ్ రికార్డ్ స్కోర్