IND vs SA T20 World Cup : దక్షిణాఫ్రికా..ఇండియా బిగ్ ఫైట్
గ్రూప్ లో టాప్ లో ఉన్న భారత జట్టు
IND vs SA T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టి20 వరల్డ్ కప్ సూపర్ -12లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా(IND vs SA T20 World Cup) తలపడనుంది. ఇప్పటికే పటిష్టమైన పాకిస్తాన్ ను 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత్. రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై 56 పరుగుల భారీ తేడాతో విక్టరీ సాధించింది.
రెండు మ్యాచ్ ల లోనూ భారత స్టార్ హిట్టర్ , బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్బుతంగా రాణించాడు. పాకిస్తాన్ పై ఓటమి అంచుల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించాడు. లీగ్ మ్యాచ్ లో భాగంగా అక్టోబర్ 30 ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. ఇక వరుస విజయాలతో పుల్ జోష్ లో ఉంది భారత్ .
అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో దుమ్ము రేపుతోంది. ఇంకో వైపు దక్షిణాఫ్రికా కూడా ఇదే తీరును కనబరుస్తోంది. టి20 వరల్డ్ కప్ లో ప్రస్తుతం భారత జట్టు హాట్ ఫెవరేట్ గా ఉంది. ఇక బలాబలాల విషయంలో రెండు టీమ్ లు సమ ఉజ్జీలుగా కనిపిస్తూనే ఉన్నా మొత్తంగా చూస్తే భారత జట్టు కే ఎక్కువ విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
బౌలర్లకు ఎక్కువ సహకరించే పిచ్ గా పేరుంది పెర్త్ మైదానానికి. ఇవాళ ఎవరు టాస్ గెలిచినా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం. ముందస్తుగా ప్రత్యర్థి టీమ్ ను కట్టడి చేస్తే ఆ తర్వాత ఈజీగా లక్ష్యాన్ని చేరుకోవచ్చనేది ప్లాన్.
ఇదిలా ఉండగా మరో 28 రన్స్ చేస్తే టి20 వరల్డ్ కప్ లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.
Also Read : రమీజ్ రజాపై మహ్మద్ అమీర్ ఫైర్