IND vs WI 1st Test : తిప్పేసిన అశ్విన్ తలవంచిన విండీస్
ఇన్నింగ్స్ 141 రన్స్ గ్రాండ్ విక్టరీ
IND vs WI 1st Test : విండీస్ టూర్ లో భాగంగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఐసీసీ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన విండీస్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వెస్టిండీస్ లోని డొమినికా మైదానంలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్(IND vs WI 1st Test) లో 141 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ గెలుపు నమోదు చేసింది. తనకు ఎదురే లేదని చాటింది టీమిండియా.
యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో 421 రన్స్ చేసింది. ఇక ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్ లో 150 రన్స్ తో సరిపెట్టుకుంది. ఇక భారీ టార్గెట్ ను ఛేదించేందుకు పనిలో పడిన విండీస్ కు చుక్కలు చూపించాడు ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అతడి మాయాజాలానికి బెంబేలెత్తి పోయారు విండీస్ బ్యాటర్లు. రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకే చాప చుట్టేశారు.
తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు కూల్చిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా 5 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. ఇదిలా ఉండగా అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక రెండో టెస్టు జూలై 20న ప్రారంభం కానుంది.
Also Read : Kathi Karthika Goud : ప్రచార కమిటీలో కత్తి కార్తీక గౌడ్