IND vs WI 3rd T20 : కనీసం ఆఖరి మ్యాచ్ లోనైనా విజయం సాధించి పరువు పోకుండా చూడాలని వెస్టిండీస్(IND vs WI 3rd T20 )చేసిన ప్రయత్నం ఫలించ లేదు. గెలుపు భారత్ నే వరించింది.
ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ వస్తున్న రోహిత్ సేన తనదైన శైలిలో రాణించింది.
ముచ్చటగా మూడో వన్డే లో సైతం సత్తా చాటింది. 17 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే బ్యాటర్ లలో సూర్య కుమార్ యాదవ్ , వెంకటేశ్ దుమ్ము రేపితే హర్షల్ పటేల్, దీపీక్ చహార్ బౌలింగ్ లో తిప్పేశారు.
దీంతో టీ20 సీరీస్ సైతం భారత్ వశమైంది.
ఇప్పటికే వన్డీ సీరీస్ కూడా కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్ లో కోహ్లీ, రిషబ్ పంత్ దూరంగా ఉన్నారు. ప్రత్యర్థి జట్టు సైతం అద్భుతమైన ప్రదర్శన చేసింది.
భారత బ్యాటర్లను పరుగులు చేయనీయకుండా కట్టడి చేసింది 15 ఓవర్ల దాకా. కానీ ఆ తర్వాత ఇండియా చెలరేగింది.
అప్పటి దాకా కేవలం 100 పరుగులు కూడా చేయని భారత్ మిగతా 5 ఓవర్లలోనే పరుగులు రాబట్టింది.
ఊహించని రీతిలో 86 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 రన్స్ చేసింది.
ఈ సీరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సీరీస్ కూడా సూర్య కుమార్ యాదవ్ దక్కించు కోవడం విశేషం.
31 బంతులు ఆడి 65 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్ 7 సిక్సర్లు ఉన్నాయి. ఇక వెంకటేశ్ అయ్యర్ 19 బంతులు ఆడి 35 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఇందులో 4 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.
Also Read : శ్రీలంకతో సీరీస్ కు భారత జట్టు డిక్లేర్