IND vs WI 5th T20 : ఆఖ‌రి టి20లోనూ మ‌న‌దే హ‌వా

4-1 తేడాతో టీమిండియాదే సీరీస్

IND vs WI 5th T20 : రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు అరుదైన ఘ‌న‌త సాధించింది. వ‌రుస‌గా అత‌డి నేతృత్వంలో సీరీస్ లు గెల‌వ‌డం విశేషం. విండీస్ టూర్ లో భాగంగా జ‌రిగిన వ‌న్డే సీరీస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసింది.

దీనికి వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ నాయ‌క‌త్వం వ‌హించాడు. ఇక గాయం కార‌ణంగా తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో భార‌త జ‌ట్టు 5 మ్యాచ్ ల టి20 సీరీస్ ను కైవ‌సం చేసుకుంది.

మొద‌టి మ్యాచ్ లో భార‌త్ బోణీ కొట్ట‌గా రెండో మ్యాచ్ లో కోలుకోలేని షాక్ ఇచ్చింది విండీస్. అన‌తరం జ‌రిగిన మూడు, నాలుగు, ఐదో టి20

మ్యాచ్ ల‌ను వ‌రుస‌గా భార‌త్ గెలుపొందింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టీమిండియా విండీస్(IND vs WI 5th T20) ను 88 ప‌రుగుల తేడాతో ఓడించింది. మొద‌ట బ‌రిలోకి దిగిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 188 ర‌న్స్ చేసింది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ 40 బంతులు ఎదుర్కొని 64 ప‌రుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి. దీపక్ హూడా 25 బంతులు ఆడి 38 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు 2 సిక్స్ లు ఉన్నాయి.

హార్దిక్ పాండ్యా 16 బాల్స్ ఎదుర్కొని 28 ర‌న్స్ తో స‌త్తా చాటాడు. అనంత‌రం మైదానంలోకి దిగిన విండీస్ 15.4 ఓవ‌ర్ల‌లో 100 ప‌రుగుల‌కే

చాప చుట్టేసింది. ర‌వి బిష్నోయ్ 16 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.

అక్ష‌ర్ ప‌టేల్ 15 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఆ జ‌ట్టులో హెట్ మైర్ ఒక్క‌డే మెరిశాడు. 35 బంతులు ఆడి 56 ప‌రుగులు చేశాడు. ఇందులో

5 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి.

Also Read : కామ‌న్వెల్త్ గేమ్స్ లో భార‌త్ ప‌త‌కాల వేట‌

Leave A Reply

Your Email Id will not be published!