India 1983 World Cup Team : 1983 వరల్డ్ కప్ టీమ్ కు జేజేలు
ప్రపంచ కప్ గెలిచి 40 ఏళ్లు
India 1983 World Cup Team : ప్రపంచ క్రికెట్ రంగంలో 1983వ సంవత్సరానికి ప్రత్యేక స్థానం ఉంది. హర్యానా హరికేన్ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు అండర్ డాగ్స్ గా ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ కప్ లో పాల్గొంది. టోర్నీలో పాల్గొన్న జట్లను మట్టి కరిపించింది. ఇతర జట్లను విస్తు పోయేలా చేసింది.
ఇదే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఫీట్ సాధించాడు టీమిండియా స్కిప్పర్ కపిల్ దేవ్ నిఖంజ్. ఏకంగా 175 రన్స్ చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నాటౌట్ గా నిలిచాడు. అనంతరం భారత జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్లింది. అప్పటికే ప్రపంచ క్రికెట్ రంగాన్ని ఒంటి చేత్తో శాసిస్తోంది వెస్టిండీస్ క్రికెట్ జట్టు.
ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. విండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ అయితే భారత జట్టును తేలికగా తీసుకున్నాడు. తమ టీమ్ దే వరల్డ్ కప్ అని ప్రకటించాడు. అంతే కాదు తాజా, మాజీ క్రికెటర్లు సైతం విండీస్ దే విజయం అని డిసైడ్ అయ్యారు. కానీ సీన్ మారింది.
కపిల్ సేన పులుల్లా విజృంభించారు. బలమైన వెస్టిండీస్ జట్టుకు చుక్కలు చూపించారు. చివరకు టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ 1983ని కైవసం చేసుకుంది(India 1983 World Cup Team). విశ్వ విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగా భారత జట్టు గెలుపొంది 2023 సంవత్సరంతో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆనాటి గెలుపొందిన టీం కలిసికట్టుగా ఫోటో దిగారు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read : Tirumala Rush : పోటెత్తిన భక్తజనం భారీగా ఆదాయం
