India Abstains : ఉక్రెయిన్ పై ఓటింగ్ కు భార‌త్ దూరం

అనుకూలం 141 వ్య‌తిరేకంగా 7

India Abstains UN Vote : ఉక్రెయిన్ లో శాశ్వ‌త శాంతిపై యునైటెడ్ నేష‌న్స్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో నిర్వ‌హించిన ఓటింగ్ కు భార‌త్ దూరంగా ఉంది. 193 మంది స‌భ్యులు జ‌రిగిన అసెంబ్లీ ఉక్రెయిన్ , దాని మ‌ద్ద‌తుదారులు ముందుకు తెచ్చిన ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. ఉక్రెయిన్ లో స‌మ‌గ్ర‌, న్యాయ‌మైన , శాశ్వ‌త శాంతి అంత‌ర్లీనంగా ఐక్య రాజ్య స‌మితి చార్ట‌ర్ సూత్రాలు అనే శీర్షిక‌తో . ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ లో దౌత్య ప్ర‌య‌త్నాల‌కు రెట్టింపు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని తీర్మానం చేసింది.

ఇదే విష‌యంలో స‌భ్య దేశాల‌ను కోరింది. ఐక్య రాజ్య స‌మితి చార్ట‌ర్ సూత్రాల‌కు అనుగుణంగా ఉక్రెయిన్ లో వీలైనంత త్వ‌ర‌గా శాంతి నెల‌కొల్పాల్సిన అవ‌స‌రాన్నినొక్కి చెప్పే తీర్మానానికి సంబంధించి భార‌త దేశం యుఎన్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో గైర్హాజ‌ర్(India Abstains UN Vote) అయింది. తీర్మానానికి అనుకూలంగా 141 ఓట్లు రాగా వ్య‌తిరేకంగా 7 ఓట్లు వ‌చ్చాయి. ఇక గైర్హాజ‌రైన 32 దేశాలు ఉన్నాయి. ఇందులో భార‌త్ కూడా ఉంది.

అంత‌ర్జాతీయంగా గుర్తించ‌బ‌డిన స‌ర‌హిద్దు లోప‌ల ఉక్రెయిన్ సార్వ భౌమాధికారం , స్వాతంత్రం , ఐక్య‌, ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌కు త‌న నిబ‌ద్ద‌త‌ను పున‌రుద్ఘాటించింది. దాని ప్రాదేశిక జ‌లాల వ‌ర‌కు విస్త‌రించింది. ర‌ష్యా త‌న సైనిక బ‌ల‌గాల‌ను అన్నింటిని వెంట‌నే బేష‌ర‌తుగా ఉక్రెయిన్ భూ భాగం నుండి ఉప‌సంహ‌రించు కోవాల‌ని కోరింది. అంత‌ర్జాతీయంగా గుర్తింపు పొందిన స‌రిహ‌ద్దులు , శ‌త్రుత్వాల విర‌మ‌ణ కోసం పిలుపునిచ్చింది.

ఉక్రెయిన్ పై యుఎన్ తీర్మానాల‌కు భార‌త్ దూరంగా ఉంది. అంత‌ర్జాతీయ చ‌ట్టం , రాష్ట్రాల సార్వ భౌమాధికారం , ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను గౌర‌వించాల్సిన అవ‌స‌రాన్ని స్థిరంగా నొక్కి చెప్పింది.

Also Read : వ‌ర‌ల్డ్ బ్యాంక్ చీఫ్ గా అజ‌య్ బంగా

Leave A Reply

Your Email Id will not be published!