CWG 2022 IND vs SA : పురుషుల హాకీ ఫైనల్ కు భారత్
3-2 తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి
CWG 2022 IND vs SA : బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్ -2022లో భారత్ సత్తా చాటుతోంది. పతకాల పంట పండింది. స్వర్ణాలు దక్కడంతో పాటు మొదటిసారిగా ప్రవేశ పెట్టిన మహిళల క్రికెట్ పోటీల్లో ఏకంగా భారత జట్టు ఇంగ్లండ్ ను ఓడించి ఫైనల్ కు చేరింది.
మరో కీలక విభాగమైన హాకీలో పురుషుల జట్టు కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును 3-2 తేడాతో ఓడించి నేరుగా ఫైనల్ కు చేరింది. ఇరు జట్లకు రజత పతకం ఖాయమైంది.
మ్యాచ్ పరంగా చివరి వరకు ఉత్కంఠను రేపింది. నువ్వా నేనా అన్న రీతిలో భారత్ , దక్షిణాఫ్రికా హాకీ జట్లు(CWG 2022 IND vs SA) తలపడ్డాయి. కానీ చివరకు భారత్ నే విజయం వరించింది.
గోల్ లేని తొలి క్వార్టర్ తర్వాత రెండో క్వార్టర్ లో భారత జట్టు దుమ్ము రేపింది. రెండు గోల్స్ చేసింది. మన్ దీప్ సింగ్ చక్కటి సోలో గోల్ తర్వాత 2-0 ఆధిక్యాన్ని సంపాదించేందుకు అభిషేక్ స్కోరింగ్ చేశాడు.
ర్యాన్ జూలియస్ పెనాల్టీ నుండి ఆఫ్ స్కోర్ చేశాడు. నాలుగో క్వార్టర్ లో భారత్ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చివరి నిమిషంలో ఆధిక్యంలోకి వెళ్లింది. గెలుపు ఇండియాను వరించింది.
ఇక కామన్వెల్త్ హాకీ విభాగంలో భారత్ ఇప్పటి వరకు మూడు విజయాలు ఒక డ్రాతో అజేయంగా నిలిచింది. మరో వైపు దక్షిణాఫ్రికా రెండు విజయాలు ఒక డ్రా ఒక ఓటమిని నమోదు చేసింది.
ఇక పూల్ -బిలో భారత్ టాప్ లో నిలిచింది. దక్షిణాఫ్రికా 2వ స్థానంతో ముగించింది. ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా , ఇంగ్లండ్ మధ్య జరగనుంది. ఈ జట్లలో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుంది.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణాలు