Raju Srivatsav : కమెడియన్ కు సంతాపాల వెల్లువ
భారత కళా రంగానికి తీరని లోటు
Raju Srivatsav : ప్రముఖ కమెడియన్, స్టాండ్ అప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(Raju Srivatsav) బుధవారం ఎయిమ్స్ లో ఢిల్లీలో కన్నుమూశారు. ఆయనకు 58 ఏళ్ల. ఆయన మృతితో సినిమా రంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు.
లక్షలాది మందిని తన నటనతో ఆయన మెప్పించారు. ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించేందుకు ప్రయత్నం చేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు.
గొప్ప నటుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. 41 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడం తట్టుకోలేక పోతున్నట్లు పేర్కొన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.
అసాధరణమైన నటన అతడి సొంతం. జీవితపు ప్రయాణాన్ని, దాని సొబగులను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారంటూ రాజు శ్రీవాస్త గురించి పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు సంతాపాలు, నివాళులు ప్రకటించారు. రాజు శ్రీవాస్తవకి(Raju Srivatsav) ప్రత్యేకమైన శైలి ఉంది. తన అద్భుతమైన ప్రతిభతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు.
చివరి వరకు నవ్వించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. రాజు శ్రీవాస్తవ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్ర సంతాపం తెలిపారు.
గొప్ప కళాకారుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. దేశం మొత్తాన్ని నవ్వించిన నటుడు లేడన్న నిజాన్ని తట్టుకోలేక పోతున్నానని పేర్కొన్నారు మరాఠా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.
కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శ్రీవాస్తవ మరణం కళా ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
Also Read : కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత