India: భారత్ గగన తలంలో పాక్ విమానాలకు నో ఎంట్రీ ?
భారత్ గగన తలంలో పాక్ విమానాలకు నో ఎంట్రీ ?
India : పహల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదులకు ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు అందిస్తున్న పాకిస్తాన్ పై ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ తో రాకపోకలు జరుపుతున్న అటారీ బోర్డర్ సహా పలు బోర్డర్స్ ను మూసివేసింది. అంతేకాదు భారత్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు తక్షణమే దేశాన్ని విడిచి తమ స్వదేశానికి వెళ్ళాలని అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలు పెట్టడానికి భారత(India) ప్రభుత్వం సిద్ధమవుతోంది.
India Block Pakistan Flights
ఈ నేపథ్యంలో భారత్ గగన తలం గుండా పాకిస్తానీ ఎయిర్ లైన్స్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించాలని భారత ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. భారత గగనతలాన్ని మూసివేస్తే… పాకిస్తాన్ విమానాలకు ప్రయాణం మరింత భారమవుతుంది. సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
మరోవైపు పాకిస్తాన్ నౌకలపైనా ఆంక్షలు అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. భారత ఓడరేవుల్లో పాకిస్తాన్ నౌకలకు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశానికి సైతం అనుమతి ఉండబోదు. ఇండియా విమానాలు ప్రయాణించకుండా తమ గగనతలాన్ని పాక్ ప్రభుత్వం గత వారం మూసి వేసిన సంగతి తెలిసిందే.
Also Read : Fire: కోల్ కతా రితురాజ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం ! 14 మంది సజీవ దహనం !