PM Modi : సౌరశక్తి తయారీలో భారత్ టాప్ – మోదీ
మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి ప్రకటన
PM Modi : సౌరశక్తి తయారీలో ప్రముఖ దేశాల తరపున భారతదేశం కూడా చేరిందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) . ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 94వది. ఇవాళ సౌర శక్తి అన్నది విద్యుత్ వినియోగానికి ప్రత్యామ్నాయం. రాబోయే భవిష్యత్తు తరాలన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటారని పేర్కొన్నారు.
సౌరశక్తి అంశం ప్రధానంగా మారుతుందన్నారు మోదీ. భారతీయులకు సూర్యుడు శతాబ్దాలుగా పూజించబడడమే కాకుండా మన జీవన శైలిలో కూడా కేంద్రంగాఉందన్నారు. సౌరశక్తి అగ్రగామి దేశాల్లో మన దేశం కూడా ఉండడం మనందరికీ గర్వకారణమన్నారు. సౌర శక్తితో విద్యుత్ ను ఉత్పత్తి చేయడంలో భారత్ అగ్రగామిగా ఉందన్నారు.
సూర్య దేవత లేదా సూర్య భగవానుని పూజించినప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలలో భక్తులు ఛత్ జరుపుకుంటారు. ప్రధాన మంత్రి దీనిపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో దాని సాంప్రదాయ అనుభవాన్ని అనుసంధానిస్తూ , సౌరశక్తి నుండి వద్యుత్ ను ఉత్పత్తి చేయడంలో భారత దేశం అగ్రగామిగా ఉందన్నారు ప్రధానమంత్రి(PM Modi) .
దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను మార్చిందన్నారు నరేంద్ర మోదీ. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి కిషాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎంకుసుమ్ ) పథకంలో వ్యవసాయ అవసరాల కోసం సౌరశక్తిని కొంత మంది రైతులను ఉదహరించారు.
కొన్ని వారాల కిందట గుజరాత్ లోని మోధేరా గ్రామాన్ని దేశంలోనే పూర్తి సౌరశక్తితో పని చేసే మొదటి గ్రామంగా ప్రధానమంత్రి ప్రకటించారు.
Also Read : సియోల్ ఘటన దిగ్భ్రాంతికరం – జైశంకర్