India VS Bangladesh : హాంగ్జూ – రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టు దుమ్ము రేపుతోంది చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో. ఇప్పటికే భారత దేశానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తమకు ఎదురే లేదని నిరూపించారు. నీరజ్ చోప్రా మరోసారి ప్రతిభను చాటాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. భారత్ ఖాతాలో ఇప్పటికే 84కు పైగా పతకాలు చేరాయి.
India VS Bangladesh Match Updates
ఇక తాజాగా చాలా కాలం గ్యాప్ తర్వాత ఆసియా క్రీడల్లో ఈసారి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. సెమీస్ లో బంగ్లాదేశ్ తో జరిగిన కీలక పోరులో భారత జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది బంగ్లా కూనలకు. ఏకంగా 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్ . నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది. భారత జట్టు బౌలర్లు సత్తా చాటారు. నిప్పులు చెరుగుతూ బంతులు వేయడంతో బ్యాటర్లు రన్స్ చేసేందుకు విల విల లాడారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. సెంచరీతో ఫుల్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో సున్నాకే వెనుదిరిగాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 40 రన్స్ చేస్తే తిలక్ వర్మ 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
Also Read : Telangana Govt : సమచారా శాఖలో కొలువుల భర్తీ
