IND v ENG : నిన్నటి దాకా దుమ్ము రేపిన టీమిండియా చెన్నైలో ఇంగ్లండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో పేలవమైన ప్రదర్శన చేసింది. ప్రధాన ఆటగాళ్లు పెవిలియన్ బాట పడితే మరోసారి రిషబ్ పంత్ , చతేశ్వర్ పుజారా అడ్డుగా నిలబడి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.
ప్రస్తుతం ఫాలో ఆన్ దిశగా అడుగులు వేస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్(IND v ENG) లో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో వాషింగ్టన్ సుందర్ 33 పరుగులతో , అశ్విన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.
ఇంగ్లండ్ జట్టు చేసిన స్కోర్ కంటే టీమిండియా 321 పరుగులు వెనుకబడి పోయింది. ఇక నాలుగో రోజు ఆటలో అశ్విన్ , సుందర్ లు కనీసం రెండు సెషన్ల పాటు ఇంగ్లండ్ బౌలర్లను నిలువరిస్తేనే ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి.
ఒక దశలో 73 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో మైదానంలోకి వచ్చిన రిషబ్ పంత్(IND v ENG) అసాధారణమైన రీతిలో ప్రత్యర్థి జట్టును ముప్పు తిప్పలు పెట్టారు.
ఎంత మంది బౌలర్లను ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ జో రూట్ ప్రయత్నం చేసినా చివరికి ఫలితం లేక పోయింది. ఏకంగా 91 పరుగులు చేసి ఇండియా జట్టు ను గట్టెక్కించేందుకు నానా తంటలాలు పడ్డాడు.
పంత్ తో పాటు చతేశ్వర్ పుజారా సైతం తాను సైతం అద్భుతమైన ప్రదర్శన చేశారు. 73 పరుగులు చేసి ఆదుకున్నారు. వీరిద్దరూ నిలబడక పోతే జట్టు అతి తక్కువ స్కోర్ కే పరిమితమైంది.
ఇరువురు పంత్ , పుజారా(IND v ENG) కలిసి 119 పరుగులు జోడించారు. ముఖ్యంగా రిషబ్ పంత్ టీ 20 ఇన్నింగ్స్ ను తలపిస్తూ..ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
మరోసారి సెంచరీ సాధించేలా కనిపించినా ఉన్నట్టుండి 9 పరుగుల తేడాతో మైదానం వీడాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో కొత్త స్పిన్నర్ డోమ్ బెస్ 4 వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీసుకున్నారు.
No comment allowed please