#Mahindra : మ‌హీంద్రా ‌ప్రియుల‌కు గుడ్ న్యూస్

భారీ ఆఫ‌ర్లు డిస్కౌంట్లు

Mahindra  : భార‌తీయ ఆటోమొబైల్ దిగ్గ‌జ కంపెనీ మ‌హీంద్రా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్ప‌టికే ప‌లు డిజైన్లు, ఫీచ‌ర్స్ తో ఆక‌ట్టుకునేలా త‌యారు చేసింది స‌ద‌రు కంపెనీ వాహ‌నాల‌ను.

మ‌హీంద్రా(Mahindra ) కు హెవీ డిమాండ్ ఉన్న బీఎస్6, ఎస్ యూవీల‌పై భారీగా డిస్కౌంట్ ప్ర‌క‌టించింది. బొలారో కారుపై 24 వేల రూపాయ‌ల నుంచి త‌క్కువ‌కు ఇస్తోంది.

అల్లురాస్ జీ4పై 3 ల‌క్ష‌ల 6 వేల దాకా త‌క్కువ‌కు దొరుకుతోంది. ఈ ఆఫ‌ర్ లో భాగంగా క్యాష్ ఆఫ‌ర్, వెహికిల్స్ ఎక్ఛేంజ్ బోన‌స్, కార్పొరేట్ డిస్కౌంట్, ఇత‌ర ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి.

ఈ డిస్కౌంట్స్ ఈనెల 28 వ‌ర‌కు మాత్ర‌మే ఉంటాయ‌ని మ‌హీంద్రా కంప‌నీ ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు దేశంలోని ఆయా ప్రాంతాల‌లో డీల‌ర్ షిప్ ల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని తెలిపింది.

మ‌హీంద్రా అల్టు రాస్(Mahindra ) జీ4పై మూడు ల‌క్ష‌ల‌కు డిస్కౌంట్ ఇస్తే ఇందులో రెండు లక్ష‌ల 20 వేల వ‌ర‌కు క్యాష్ ఆఫ‌ర్, ఒక‌వేళ మ‌రో వాహ‌నాన్ని మార్చుకుంటే బోన‌స్ కింద అద‌నంగా 50 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మ‌రో 16 వేల నుంచి 20 వేల రూపాయ‌ల వ‌ర‌కు అందిస్తోంది కంపెనీ.

ఇంకో వైపు మ‌హీంద్రా స‌బ్ కాంపాక్ట్ ఎస్ యూ వీపై ఎక్కువ‌లో ఎక్కువ 44 వేల వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫ‌ర్ కింద 10 వేల డిస్కౌంట్ , ఎక్సేంజ్ బోన‌స్ కింద 5 వేలు , బోన‌స్ కింద మ‌రో 25 వేల రూపాయ‌లు ఇస్తోంది.

ఇక కేయువీ 100 ఎన్ఎక్స్టీపై 38 వేలు క్యాష్, బోన‌స్ కింద 20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద 4 వేలు పొంద‌వ‌చ్చు. ఈ వెహికిల్ తీసుకుంటే 62 వేల దాకా త‌క్కువ‌కు దొరుకుతుంది.

మ‌రో వైపు మహీంద్రా కంపెనీలో హెవీ డిమాండ్ ఉన్న వెహికిల్ ఎక్స్ యువి 500 మీద దాదాపు 80 వేల‌కు పైగా డిస్కౌంట్ ల‌భిస్తుంది. మ‌రాజో వెహికిల్ పై 36 వేలు త‌క్కువ‌కు దొరుకుతుంది. ఇంకో వెహికిల్ బొలెరో. దీనిపై ర‌మార‌మి 24 వేల దాకా బోన‌స్ ల‌భిస్తుంది.

No comment allowed please