#JayeshRanjan : ఇక సోష‌ల్ ఇన్నోవేష‌న్ పాల‌సీ – జ‌యేశ్ రంజ‌న్

అంకురాల‌కు ఆలంబ‌న

Jayesh Ranjan : ప్ర‌తినిత్యం జీవితంలో ఎదుర్కోబోయే సామాజిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపే దిశ‌గా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. ఐటీ ప‌రంగా టీఎస్ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తోంది.

నూత‌న ఆలోచ‌న‌ల‌ను ప్రోత్స‌హించే దిశ‌గా స్టార్ట‌ప్ వేదిక‌గా టీ హ‌బ్ , వీ హబ్ కృషి చేస్తున్నాయి. తాజాగా సామాజిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపే దిశ‌గా త్వ‌ర‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం సోష‌ల్ ఇన్నోవేష‌న్ పాల‌సీని తీసుకు రానున్న‌ట్లు ఐటీ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్(Jayesh Ranjan) వెల్ల‌డించారు.

తెలంగాణ స్టేట్ ఇన్నోవేష‌న్ సెల్ చేప‌ట్టిన తెలంగాణ సోష‌ల్ ఇంపాక్ట్ బూట్ క్యాంప్ ఇందుకు బ‌ల‌మైన పునాది వేసింద‌న్నారు. సుస్థిర అభివృద్ధిని సాధించాల‌న్న ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని. ఆ దిశ‌గా సోష‌ల్ ఇష్యూస్ కు పరిష్కారం చూపించే సోష‌ల్ స్టార్ట‌ప్ లు, ఎంట‌ర్ ప్రైజెస్ ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం టీఎస్ఐసీ ఆధ్వ‌ర్యంలో ఈ బూట్ క్యాంప్ ను నిర్వ‌హించింద‌ని తెలిపారు జ‌యేశ్ రంజ‌న్(Jayesh Ranjan).

దీనికి టీ హ‌బ్ తో స‌హా తొమ్మిది ప్ర‌భుత్వ శాఖ‌లు, బాల వికాస ఇంట‌ర్నేష‌న‌ల్ సెంట‌ర్ , త‌దిత‌ర సంస్థ‌లు ఎంత‌గానో తోడ్పాటు అందించాయ‌ని వెల్ల‌డించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని గ‌త ఏడాది న‌వంబ‌ర్ లో స్టార్ట్ చేశామ‌న్నారు జ‌యేశ్ రంజ‌న్. 95 కు పైగా అంకురాలు, సంస్థ‌ల నుంచి అప్లికేష‌న్స్ వ‌చ్చాయ‌న్నారు.

వీటిని ప‌రిశీలించి 61 స్టార్ట‌ప్ ల‌ను ఎంపిక చేశామ‌న్నారు. ఐటీ శాఖ తో పాటు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయం, ఆరోగ్యం, పాఠ‌శాల విద్య‌, ఇంధ‌నం, ప‌ర్యావ‌ర‌ణం, పురపాల‌క ప‌ట్ట‌ణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం, విక‌లాంగుల సంక్షేమ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు స్టార్ట‌ప్ ల‌కు సూచ‌న‌లు అందజేశార‌ని జ‌యేశ్ రంజ‌న్ వెల్ల‌డించారు.

ఎంపిక చేసిన అంకుర సంస్థ‌ల య‌జ‌మానులు త‌మ ప్రాజెక్టు వివ‌రాల‌ను అంద‌జేశారు. వీటిలో 28 అంకురాల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చారు. క‌రోనా కాలంలో సైతం ఇన్వెస్ట్ చేసేందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు ఐటీ ముఖ్య కార్య‌ద‌ర్శి.

No comment allowed please