Womens India Team : ఆసియా కప్ కోసం భారత మహిళా జట్టు
ప్రకటించిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ
Womens India Team : మహిళల ఆసియా కప్ 2022కు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలెక్షన్ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పూర్తి భారత జట్టును(Womens India Team) వెల్లడించింది.
హర్మన్ ప్రీత్ కౌర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా స్మృతి మంధానకు వైస్ కెప్టెన్ గా ప్రకటించింది. విమెన్స్ వరల్డ్ కప్ అక్టోబర్ 1 నుంచి బంగ్లాదేశ్ లో జరగనుంది.
తొలి రోజు శ్రీలంకపై భారత జట్టు మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 3న మలేషియా జట్టుతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో 4న , పాకిస్తాన్ జట్టుతో అక్టోబర్ 7న మహిళల జట్టు ఆడనుంది.
ఇప్పటికే భారత జట్టు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తూ వస్తోంది. ఇక బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించిన జట్టు ఇలా ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ కాగా స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ గా ఉన్నారు.
జట్టులో దీప్తి శర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ , సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్ ) , స్నేహ రాణా, దయాళన్ హేమలత, మేఘానా సింగ్ , రేణుకా ఠాకూర్ , రాజేశ్వరి వస్త్రాకర్ , పూజా వస్త్రాకర్ గైక్వాడ్, రాధా యాదవ్ , కేపీ నవగిరే ఉన్నారు.
ఇక ఆసియా కప్ 2022 కోసం టీమ్ ఇండియా తరపున స్టాండ్ బై ప్లేయర్లను ఎంపిక చేసింది సెలక్షెన్ కమిటీ. తానియా స్నా భాటియా, సిమ్రాన్ దిల్ బహదూర్ ఉన్నారు.
ప్రస్తుతం మహిళా క్రికెట్ ప్రపంచంలో భారత మహిళా జట్టు కీలకమైన విజయాలు సాధిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ పదవీ విరమణ పొందిన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ పగ్గాలు అప్పగించాక జట్టు విజయాలు సాధిస్తోంది.
Also Read : బౌలర్ల నిర్వాకం వల్లనే పరాజయం