S Jai Shankar Hindi Language : హిందీని ప్రోత్సహించడం భారత్ లక్ష్యం
స్పష్టం చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి
S Jai Shankar Hindi Language : ప్రపంచ వ్యాప్తంగా హిందీని ప్రోత్సహించేందుకు భారత దేశం ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్. మూడు రోజుల పాటు జరిగిన హిందీ వరల్డ్ కాన్ఫరెన్స్ ఈవెంట్ ఇవాల్టితో ముగిసింది.
అంతర్జాతీయ రంగంలో హిందీ భాషను ప్రోత్సహించే దిశలో పని చేసే సంస్థలను బలోపేతం చేయడం తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు జై శంకర్. టీచర్లకు శిక్షణ పొందేందుకు భాషా ప్రయోగశాల ఒకటి అని చెప్పారు. ఇందులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు జై శంకర్(S Jai Shankar Hindi Language).
ప్రయోగశాల ల్యాబ్ కు సంబంధించి ఎంఈఏ కార్యదర్శి వి. మురళీధరన్ ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి.
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ పై ఫోకస్ పెడుతున్నామని చెప్పారు జై శంకర్. మా అంతర్గత చర్య పూర్తయ్యాక తామ ఈ లాంగ్వేజ్ ల్యాబ్ ను ఫిజీకి ఇస్తామని స్పష్టం చేశారు. ఫిజీ కోసం మాకు అభివృద్ది ,సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం ఉందన్నారు. ఇది బాగా పని చేస్తోందని స్పష్టం చేశారు జై శంకర్.
విదేశాలలో హిందీని ప్రోత్సహించేందుకు బారత దేశం హిందీ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ని బలోపేతం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా వరల్డ్ హిందీ సదస్సును విజయవంతం చేసినందుకు అభినందించారు కేంద్ర మంత్రి. 12వ ప్రపంచ హిందీ సదస్సు ఫిబ్రవరి 15 నుండి 17 వరకు ఫిజీలోని నాడిలో జరిగింది. భారత ప్రభుత్వం హిందీ ప్రచార వ్యాప్తికి ప్రయారిటీ ఇస్తోంది. ఫిజీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నామని తెలిపారు జై శంకర్.
Also Read : 5 రోజుల్లో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ – షా