Arvind Kejriwal : విద్య తోనే భారత దేశం అభివృద్ది
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ప్రతి భారతీయుడిని ధనవంతులుగా మార్చేందుకు కీలకమైన ఫార్ములా రూపొందించారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఐఐటీ – జేఈఈ విజయాన్ని గుర్తు చేసుకున్నారు.
విద్య మాత్రమే భారత దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చ గలదన్నారు. తాను 563 ర్యాంక్ సాధించానని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో నేను ఒక ప్రభుత్వ పాఠశాల నుండి 569 ర్యాంక్ పొందిన ఒక సెక్యూరిటీ గార్డు కొడుకుని కలిశానని తెలిపారు.
అతడి తండ్రికి నెలకు రూ. 12,000 జీతం వస్తుంది. తనయుడు ఐఐటీ నుండి పాసయ్యాడు. అతడికి నెలకు రూ. 2 లక్షల ప్రారంభ వేతనం లభిస్తుందన్నారు. ఆ కుటుంబం అనుభవిస్తున్న పేదరికం దూరం అవుతుందన్నారు.
మన పిల్లలందరికీ మెరుగైన విద్య అందిస్తే ప్రతి కుటుంబం ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందని స్పష్టం చేశారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). అరవింద్ కేజ్రీవాల్ జాతీయ మీడియాతో మాట్లాడారు.
డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనే ప్రచారంలో భాగంగా ఆయన బిజీగా గడుపుతున్నారు.
ఇందులో భాగంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో కీలకమైన మార్పులు తీసుకు వచ్చామని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal).
అంతకు ముందు సీఎం ఐఐటీ కోసం జేఈఈలో ఉత్తీర్ణులైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కలిశారు. నేను ఐఐటీ మాజీ స్టూడెంట్ ను. ఇది నాకు భావోద్వేగ క్షణమని పేర్కొన్నారు సీఎం.
ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1,141 మంది విద్యార్థులు ఈ ఏడాది ఐఐటీ – జేఈఈ , మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ లో ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు అరవింద్ కేజ్రీవాల్.
Also Read : దాడులు సరే అసలు దొంగలు ఎవరు