INDW vs AUSW T20 : పోరాడి ఓడిన టీమిండియా

ఫైన‌ల్ కు చేరిన ఆస్ట్రేలియా

INDW vs AUSW  Semi Finals : ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ మ‌హిళ‌ల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త మ‌హిళా జ‌ట్టు చివ‌రి దాకా పోరాడింది. ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. ఎప్ప‌టి లాగే ఆస్ట్రేలియా ఎక్క‌డా టెన్ష‌న్ కు లోనుకాకుండా ప‌ని కానిచ్చేసింది. చివ‌రి ఓవ‌ర్ దాకా నువ్వా నేనా అన్న రీతిలో ఆట సాగింది. క్రికెట్ అభిమానులు మ్యాచ్ ను ఎంజాయ్ చేశారు. ప్ర‌పంచ క‌ప్ గెల‌వాల‌న్న ఆశ నెర‌వేర‌లేదు. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ చేసిన ఒంట‌రి పోరాటం వృధా అయ్యింది.

ఐర్లాండ్ తో ఇర‌గ‌దీసిన స్మృతీ మంధాన అస‌లైన మ్యాచ్ లో (INDW vs AUSW  Semi Finals) చేతులెత్తేసింది. ఆసిస్ మ‌రోసారి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది. ఇక శుక్ర‌వారం రెండో సెమీ ఫైన‌ల్ ఇంగ్లండ్..ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. రిచ్ లీగ్ మొద‌టి నుంచి ఆసిస్ , ఇంగ్లండ్ జ‌ట్లు టైటిల్ హాట్ ఫెవ‌రేట్ గా ఉన్నాయి. ఇప్ప‌టికే గ‌త ఏడాది ఐసీసీ మ‌హిళా టి20ని కైవ‌సం చేసుకుంది ఆస్ట్రేలియా. ఇక కీల‌క‌మైన సెమీస్ లో టీమిండియా కేవ‌లం 5 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. రిచ్ లీగ్ నుంచి నిష్క్ర‌మించింది.

టాస్ గెలిచిన ఆసిస్ కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ర‌న్స్ చేసింది. మూనీ 54 ర‌న్స్ చేచ‌స్తే కెప్టెన్ లానింగ్ 49 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. గార్డెన‌ర్ 31, హీలీ 2 ప‌రుగుల‌తో రాణించారు. ఓపెన‌ర్లు మంధాన‌, వ‌ర్మ త‌క్కువ ర‌న్స్ కే వెనుదిరిగారు. జెమీమా రోడ్రిగ్స్ 43 , హ‌ర్మ‌న్ ప్రీత్ 52 ర‌న్స్ తో ఆక‌ట్టుకున్నారు. భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. కీల‌క స‌మ‌యంలో కెప్టెన్ ర‌నౌట్ కావ‌డంతో మ్యాచ్ పూర్తిగా వారి చేతుల్లోకి వెళ్లి పోయింది. 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 167 ర‌న్స్ మాత్ర‌మే చేసింది.

Also Read : రోహిత్ ఫిట్ నెస్ పై క‌పిల్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!