INDW vs THW Asia Cup : భార‌త్ త‌డాఖా థాయిలాండ్ విల‌విల‌

37 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ

INDW vs THW Asia Cup : మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2022లో భార‌త జ‌ట్టు సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. థాయ్ లాండ్ జ‌ట్టును 15.1 ఓవ‌ర్ల‌లోనే 37 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. అనంత‌రం కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి 6 ఓవ‌ర్ల‌లో టార్గెట్ పూర్తి చేసి ఘ‌న విజ‌యం సాధించింది.

సోమ‌వారం సిల్హెట్ లో జ‌రిగిన మ‌హిళ‌ల ఆసియా క‌ప్ లీగ్ మ్యాచ్ లో భార‌త బౌల‌ర్ల ధాటికి బెంబేలెత్తి పోయారు. ఇక 38 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త మ‌హిళా జ‌ట్టు(INDW vs THW Asia Cup) 8 ప‌రుగుల వ‌ద్ద ష‌ఫాలీ వ‌ర్మ‌ అవుట్ అయ్యింది. పూజా వ‌స్త్రాక‌ర్ 12 ప‌రుగులు చేస్తే స‌బ్బినేని మేఘ‌న 20 ప‌రుగులు చేసింది.

దీంతో సుల‌భంగా విజ‌యాన్ని న‌మోదు చేసింది. అంత‌కు ముందు స్టాండ్ అప్ కెప్టెన్ స్మృతి మంథాన ఫీల్డింగ్ ఎంచుకుంది. దీప్తి శ‌ర్మ నాలుగు ఓవ‌ర్ల‌లో 10 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టింది. ఆమె తో పాటు స్నేహ రాణా మూడు వికెట్లు తీసింది. రాజేశ్వ‌రి గైక్వాడ్ 2 వికెట్లు తీసి స‌త్తా చాటింది.

రనౌట్ రూపంలో థాయ్ లాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. మేఘ‌నా సింగ్ ఒక వికెట్ తీసింది. ఇదిలా ఉండ‌గా మ‌హిళ‌ల ఆసియా క‌ప్ 2022లో భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌లో ఒక్క పాకిస్తాన్ తో మాత్ర‌మే ఓట‌మి పాలైంది. కానీ అన్ని మ్యాచ్ ల‌లో స‌త్తా చాటుతూ దుమ్ము రేపుతోంది.

ఇలాగే ఆడితే భార‌త మ‌హిళా జ‌ట్టు క‌ప్ గెలిచినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌ని లేదు.

Also Read : అయ్య‌ర్ అయ్యారే కిష‌న్ భ‌ళారే

Leave A Reply

Your Email Id will not be published!