Narayan Murthy : కరీనాపై ఇన్ఫోసిస్ చైర్మన్ కామెంట్స్
ఆమె ప్రవర్తన నచ్చలేదని ఆగ్రహం
Narayan Murthy : భారతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన బాలీవుడ్ నటి కరీనా కపూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ మీడియా సంస్థతో సుధా, నారాయణ మూర్తి(Narayana Murthy) దంపతులు మాట్లాడారు. ఈ సందర్బంగా తాము ఎదుర్కొన్న అనుభావాలకు సంబంధించి పంచుకున్నారు. ఈ సందర్బంగా నటి కరీనా కపూర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Narayan Murthy Comments
తాము ప్రయాణం చేస్తున్న సమయంలో నటి కూడా జర్నీ చేస్తోంది. ఆమె ఎయిర్ పోర్ట్ లోకి దిగగానే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ గుమిగూడారు. కానీ వారిని కన్నెత్తి చూడలేదు. ఆపై చులకన చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్లి పోయిందని వాపోయారు. ఈ విషయం తాను దగ్గరుండి చూశానని , ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ప్రత్యేకించి సినీ రంగం, క్రీడా రంగాలకు చెందిన వారికి పెద్ద ఎత్తున అభిమానులు ఉండడం సర్వ సాధారణమన్నారు.
కానీ నటి అయినప్పటికీ కొంచెం అహం తగ్గించుకుంటే మంచిదని సూచించారు. ఇది అన్ని వర్గాల వారికి వర్తిస్తుందని స్పష్టం చేశారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అటు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఆయన అల్లుడు యుకె ప్రైమ్ మినిష్టర్ రిషి సునక్. కోట్లాది రూపాయలకు అధిపతి.
Also Read : EMRS Recruitment 2023 : ఏకలవ్య స్కూళ్లలో 6,329 పోస్టులు