Artifact AI : పవర్డ్ న్యూస్ యాప్ ఆర్టి ఫ్యాక్ట్
ఇన్స్టాగ్రామ్ కో ఫౌండర్స్ క్రియేట్
Artifact AI : జిందగీ మారుతోంది. టెక్నాలజీ అప్ డేట్ అవుతోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుమ్ము రేపుతోంది. దీని ఆధారంగా చేసుకుని క్రియేట్ చేసిన చాట్ జిపిటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సెర్చింగ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కు వణుకు పుట్టిస్తోంది. ఇదే సమయంలో దీనితో అనుసంధానం చేసుకుని మైక్రోసాఫ్ట్ తాను డెవలప్ చేసిన బింగ్ కు జోడించింది. దీంతో దాని రేటింగ్ కూడా మెల మెల్లగా పెరుగుతోంది. అదే క్రమంలో గూగుల్ షేర్స్ కూడా పతనం కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా మెటా ఫేస్ బుక్ కు చెందిన ఇన్ స్టా గ్రామ్ కు చెందిన కో ఫౌండర్స్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు కొత్తగా ఏఐ పవర్డ్ న్యూస్ యాప్ ఆర్టి ఫ్యాక్ట్(Artifact AI) పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిని ప్రస్తుతం ఎవరైనా కొత్త అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఉపయోగించు కోవచ్చు కూడా. వెయిట్ లిస్ట్ , ఫోన్ నెంబర్ అవసరం లేదు. ఆర్ట్ ఫ్యాక్ట్ టీం ఈ విషయం గురించి తమ బ్లాగ్ లో తెలియ చేసింది.
ఇన్ స్టా గ్రామ్ కో ఫౌండర్స్ కెవిన్ సిస్ట్రోమ్ , మైక్ క్రీగర్ ద్వారా కొత్త కృత్రిమ(Artifact AI) మేధస్సు ఆధారిత వ్యక్తిగతీకరించిన న్యూస్ ఫీడ్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం కొత్త ఫీచర్లతో పాటు అందరికీ అందుబాటులో ఉండడం విశేషం. కొత్త వెర్షన్ తో వినియోగదారులు వారి పరిచయాలను కనెక్ట్ చేసుకునే వీలు కల్పించింది. వారి నెట్ వర్క్ లో జనాదరణ పొందిన కథనాలు కూడా చూడొచ్చు. రీడింగ్ హిస్టరీని విజువలైజ్ చేయడంలో సహాయ పడేందుకు కంపెనీ మరో సాధనాన్ని కూడా జోడించింది.
Also Read : వరల్డ్ బ్యాంక్ చీఫ్ గా అజయ్ బంగా